ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)కి.. చెందిన మార్ట్గేజ్ రుణ విభాగం ఎల్ఐసీ హౌజింగ్ ఫినాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. రూ.50 లక్షల విలువైన హోం లోన్స్‌కు వడ్డీ రేట్లను జీవనకాల గరిష్ఠమైన 6.66 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
కరోనా సంక్షోభం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ వెల్లడించింది. దీని ద్వారా సొంతింటి కల నేరవేర్చుకోవాలనుకునే వారికి లబ్ధి చేకూరుతుందని.. డిమాండ్ కూడా పుంజుకుంటుందని పేర్కొంది.
6.6 శాతం వడ్డీ రేటుతో తీసుకునే రుణాలను తిరిగి చెల్లించేందుకు గరిష్ఠంగా 30 ఏళ్ల వ్యవధిని పెట్టుకోవచ్చని సంస్థ తెలిపింది.
రుణం తీసుకోవడం ఎలా?
కరోనా పరిస్థితుల నేపథ్యంలో, వినియోగదారుల సౌలభ్యం కోసం తమ కార్యాలయాలకు రాకుండానే రుణం పొందేందుకు ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ వీలు కల్పించింది. సంస్థ మొబైల్ యాప్ ద్వారా సంబంధిత వివరాలను నింపి దరఖాస్తు చేసుకుంటే.. అర్హులైన వారికి రుణం మంజూరవుతుంది.
అర్హతలు ఏమిటి?
ఇప్పటి వరకు గృహ రుణం తీసుకోని.. వేతన జీవులు ఈ రుణం తీసుకునేందుకు అర్హులు. ఆగస్టు 31 వరకు ఈ రుణానికి ధరఖాస్తు చేసుకునే వీలుంది. రుణ దరఖాస్తుదారుడి సిబిల్ స్కోర్, పలు ఇతర ఆర్థిక పరమైన వివరాలను పరిశీలించిన తర్వాతే రుణాలు మంజూరు చేయనుంది ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్.
ఇవీ చదవండి: