ETV Bharat / business

డిసెంబర్​ నాటికి జాతీయ ఉపాధి విధానం! - ఏప్రిల్​ నుంచి నాలుగు నూతన కార్మిక చట్టాల అమలు

నాలుగు నూతన కార్మిక చట్టాలను అమలు చేస్తూ.. డిసెంబర్​ నాటికి జాతీయ ఉపాధి విధానానికి తుది రూపు ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నాలుగు నూతన కార్మిక చట్టాలను ఏప్రిల్​ నుంచి అమలు చేయాలని కూడా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Shape to Nep by December
డిసెంబర్​ నాటికి ఎన్​ఈపీకి తుది రూపు
author img

By

Published : Jan 10, 2021, 12:41 PM IST

జాతీయ ఉపాధి విధానానికి(ఎన్​ఈపీ) డిసెంబర్​ నాటికి తుది రూపు ఇవ్వాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు నూతన కార్మిక చట్టాలను అమలు చేస్తూ.. ఈ విధానాన్ని రూపొందించనున్నట్లు సమాచారం.

పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన రక్షణ వంటి చట్టాలకు పార్లమెంట్ గత ఏడాది ఆమోదం తెలిపింది. అంతకుముందు ఏడాదే వేతన కోడ్​ చట్టానికి ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించింది కార్మిక శాఖ. అయితే మొత్తం నాలుగు చట్టాలను ఒకేసారి అమలు చేయాలనే ఉద్దేశంతో.. వేతన కోడ్ వాయిదా వేసింది. ఈ నాలుగు చట్టాలను 2021 ఏప్రిల్ నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, ఎంప్లాయ్​మెంట్ ఇంటెన్సివ్​ సెగ్మెంట్​లోకి పెట్టుబడులు తీసుకురావడం వంటి వాటికి కావాల్సిన వ్యూహాలను రూపొందిచడం ఎన్​ఈపీ ముఖ్య ఉద్దేశం.

ఈ కోడ్​లు అమలైతే.. దేశంలో ఉన్న 50 కోట్లకుపైగా కార్మికులకు మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తోంది.

ఇదీ చూడండి:నూతన కార్మిక చట్టాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.