ETV Bharat / business

పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో వృద్ధి - Industrial production

2020 జనవరిలో పారిశ్రామికోత్పత్తి సూచీ 2 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. తయారీ రంగంలో మందగమనం నెలకొన్నప్పటికీ.. పలు రంగాల్లో సానుకూలతలతో వృద్ధి సాధ్యమైంది.

Industrial production grows 2% in January
జనవరిలో పారిశ్రామికోత్పత్తిలో స్వల్ప వృద్ధి
author img

By

Published : Mar 12, 2020, 7:23 PM IST

ఈ ఏడాది జనవరిలో దేశీయ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) సుమారు 2 శాతం మేర వృద్ధి సాధించింది. తయారీ రంగంలో మందగమనం ఉన్నప్పటికీ కొన్ని కీలక రంగాల సానుకూలతలతో వృద్ధి నమోదైంది.

గతేడాది 2019 జనవరిలో ఐఐపీ 1.6 శాతంగా నమోదైంది.

ఎన్​ఎస్​ఓ గణాంకాల ప్రకారం..

జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్​ఎస్​ఓ) తాజాగా పారిశ్రామికోత్పత్తి ఫలితాలను విడుదల చేసింది. ఈ జనవరిలో తయారీ రంగం వృద్ధి 1.5 శాతానికి చేరింది. గతేడాది ఇదే సమయానికి వృద్ధి 1.3 శాతంగా ఉంది.

విద్యుత్​ ఉత్పాదన సుమారు 3.1 శాతం మేర వృద్ధి సాధించింది. 2019 జనవరిలో విద్యుత్తు రంగం కేవలం 0.9 శాతంగానే వృద్ధి నమోదు చేసింది.

2020, జనవరిలో గనుల రంగంలో అత్యధికంగా వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 3.8గా ఉన్న వృద్ధి ఈ జనవరిలో 4.4 శాతానికి చేరుకుంది.

2019,ఏప్రిల్​-2020 జనవరి సమయంలో ఐఐపీ వృద్ధి రేటు సుమారు 0.5 శాతం మేర క్షీణించింది. 2018-19 సమయంలో అది 4.4 శాతంగా ఉంది.

Industrial production grows 2% in January
జనవరిలో పారిశ్రామికోత్పత్తి ఇలా

ఇదీ చూడండి: కరోనా దెబ్బకు స్టాక్​ మార్కెట్ల 'లెక్కలు' తారుమారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.