గతంలో ఎన్నడూ లేనంతగా స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో 42వేల మార్క్‌ను దాటి సరికొత్త గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. నేడు 32,778 పాయింట్ల అత్యల్ప స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 9,590 వద్ద స్థిరపడింది.
గతనెలలో కరోనా భయాలు కొనసాగినప్పటికీ.. స్టాక్ మార్కెట్లు స్వల్ప ఒడుదొడుకులనే ఎదుర్కొన్నాయి. అయితే ఫిబ్రవరి 28 తర్వాత.. రికార్డు స్థాయి నష్టాల్లోకి జారుకున్నాయి.
ఈ ఏడాది జనవరి 14న సెన్సెక్స్ జీవనకాల గరిష్ఠం 41,953 వద్ద, నిఫ్టీ జనవరి 16న జీవనకాల గరిష్ఠం 12,355 పాయింట్ల వద్ద ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
ఫిబ్రవరి 28 తర్వాత లాభనష్టాలు ఇలా..
తేదీ | సెన్సెక్స్ | నిఫ్టీ |
ఫిబ్రవరి 28 | -1,448 | -431 |
మార్చి 2 | -153 | -69 |
మార్చి 3 | +480 | +171 |
మార్చి 4 | -214 | -52 |
మార్చి 5 | +61 | +18 |
మార్చి 6 | -894 | -280 |
మార్చి 9 | -1,942 | -538 |
మార్చి 11 | +62 | +07 |
మార్చి 12(నేడు) | -2,919 | -868 |
ఇదీ చూడండి: స్టాక్‌మార్కెట్ల నష్టాలకు కారణాలు ఇవే..