కరోనా విజృంభణ తర్వాత దేశంలో నిరుద్యో రేటు తీవ్ర స్థాయికి చేరగా.. ఇప్పుడు తిరిగి తగ్గుముఖం పడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20 లక్షలు దాటినప్పటికీ.. నిరుద్యోగ రేటు లాక్డౌన్కు ముందున్న స్థాయికి తగ్గినట్లు తెలుస్తోంది.
కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఏప్రిల్, మే నెలల్లో రికార్డు స్థాయిలో 23.5 శాతానికి పెరిగింది. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో జూన్ నుంచి నిరుద్యో సమస్య తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) ప్రకారం జూన్లో 11 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జులైలో 7.4 శాతానికి తగ్గింది. లాక్డౌన్ విధించడానికి ముందు ఫిబ్రవరిలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉండటం గమనార్హం.
ఉత్తర్ప్రదేశ్లో అత్యధికంగా నిరుద్యో రేటు జులైలో 5.5 శాతానికి దిగొచ్చింది. ఫిబ్రవరిలో ఇది 9 శాతంగా ఉండటం గమనార్హం.
మహారాష్ట్రలోనూ నిరుద్యో రేటు 4.7 శాతం (ఫిబ్రవరిలో) నుంచి 4.4 శాతానికి (జులైలో) తగ్గినట్లు సీఎంఐఈ తెలిపింది.
గుజరాత్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, పంజాబ్, హరియాణ, కేరళ, రాజస్థాన్, ఒడిశాల్లోనూ జులైలో నిరుద్యోగ రేటు భారీగా తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ రాష్ట్రాల్లో ఇంకా అధికమే..
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, దిల్లీల్లో మాత్రం కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైనట్లు సీఎంఐఈ పేర్కొంది.
దేశంలో కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో నిరుద్యోగ రేటు జులైలో 8.1 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో ఇది 2.1 శాతంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్లోనూ నిరుద్యోగ రేటు జులైలో 8.3 శానికి పెరిగింది. ఫిబ్రవరిలో ఇక్కడ నిరుద్యోగ రేటు 5.1 శాతంగా ఉన్నట్లు సీఎంఐఈ తెలిపింది.
దిల్లీలో నిరుద్యోగ రేటు ఫిబ్రవరి (14.8 శాతం)తో పోలిస్తే జులైలో 20.3 శాతానికి పెరగటం ఆందోళన కలిగించే విషయం.
ఇదీ చూడండి:రేట్లు తగ్గించలేదు కానీ.. పలు కీలక చర్యలు