దేశంలో సేవా రంగం మరోసారి కుదేలైంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరగటం, రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ వంటి కారణాలతో ఎనిమిది నెలల తర్వాత సేవా రంగ కార్యకలాపాలు సగటుకన్నా దిగువకు పడిపోయాయి.
ఐహెచ్ఎస్ మార్కిట్ విడుదల చేసిన నెలవారీ నివేదిక ప్రకారం.. సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మేలో 46.4కు పడిపోయింది. ఏప్రిల్లో ఇది 54గా ఉండటం గమనార్హం.
అంతర్జాతీయంగానూ దేశీయ సేవా రంగానికి డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించడం, వ్యాపారాల మూసివేత ఇందుకు ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది.
గత నెల ఉద్యోగాల పరంగా చూస్తే.. కరోనా భయాలు, విక్రయాల క్షీణత వల్ల సేవా రంగంలోని చాలా కంపెనీలు సిబ్బందిని తగ్గించుకున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ వివరించింది.
ఇదీ చదవండి:అభివృద్ధి ర్యాంకులో కేరళ మళ్లీ టాప్