ETV Bharat / business

ఏప్రిల్​లో మూడు నెలల కనిష్ఠానికి సేవా రంగం! - సేవా రంగంపై కరోనా దెబ్బ

కరోనా సంక్షోభ ప్రభావం సేవా రంగంపై తీవ్రంగా పడింది. దేశీయంగా విధిస్తున్న ఆంక్షలు, వృద్ధి రేటుపై ప్రతికూల అంచనాల కారణంగా సేవా రంగ పీఎంఐ ఏప్రిల్​లో 54కి తగ్గింది. ఇది మూడు నెలల కనిష్ఠం.

Corona impact on Service sector
కరోనాతో సేవ రంగ కుదేలు
author img

By

Published : May 5, 2021, 2:19 PM IST

దేశీయ సేవా రంగ కార్యకలాపాలు ఏప్రిల్​లో మూడు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. కరోనా సంక్షోభం, వృద్ధి రేటుపై ప్రతికూల అంచనాల నేపథ్యంలో సేవా రంగం కుదేలైనట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్ నెలవారీ నివేదిక పేర్కొంది.

ఏప్రిల్​లో సేవా రంగ పీఎంఐ (పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) 54కి తగ్గిందని తెలిపింది ఐహెచ్​ఎస్​ మార్కిట్​. మార్చిలో ఇది 54.6గా నమోదైనట్లు గుర్తు చేసింది.

గత నెల ఉద్యోగాల్లో (సేవా రంగంలో) కూడా క్షీణత నమోదైనట్లు నివేదిక పేర్కొంది. ఈ రంగంలో ఉద్యోగాలు తగ్గటం ఇది వరుసగా ఐదో నెల.

ప్రయాణాలపై విధించిన ఆంక్షల నేపథ్యంలో భారత సేవా రంగ ఎగుమతులు 14వ నెల కూడా క్షీణించినట్లు తెలిపింది ఐహెచ్​ఎస్​ మార్కిట్​.

ఇదీ చదవండి:ఆ రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం:ఆర్​బీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.