కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతుండటం భారత సేవారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మార్చిలో సేవా రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 54.6కి పడిపోయినట్లు ఐహెచ్ఎస్ మర్కిట్ నెలవారీ నివేదికలో వెల్లడైంది. ఫిబ్రవరిలో ఇది 55.3గా నమోదైంది. అయినప్పటికీ వరుసగా ఆరో నెలలోనూ సేవా రంగ పీఎంఐ సానుకూలంగా నమోదవడం గమనార్హం.
పీఎంఐ సూచీ 50 ఎగువన నమోదైతే వృద్ధి సాధించినట్లు, అంతకంటే తక్కువగా ఉంటే క్షీణించినట్లుగా పరిగణిస్తారు.
కరోనా కేసులు పెరుగుతుండటం, పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తుండటం వల్ల ఏప్రిల్లో సేవా రంగం ఇంకాస్త ఒత్తిడి ఎదుర్కోవచ్చని అంచనా వేసింది నివేదిక.
సేవ, తయారీ రంగాల సంయుక్త పీఎంఐ మార్చిలో 56కు తగ్గినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక పేర్కొంది. ఇది ఫిబ్రవరిలో ఇది 57.3గా ఉన్నట్లు వివరించింది.
ఇదీ చదవండి:7 నెలల కనిష్ఠానికి తయారీ రంగ కార్యకలాపాలు!