ETV Bharat / business

కరోనా టీకాల కోసం రూ.50 వేల కోట్లు కేటాయింపు!

దేశ ప్రజలకు కరోనా టీకాను అందించే ప్రక్రియ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ద్వారా.. ఈ ప్రక్రియ కోసం కేంద్రం సుమారు రూ.50 వేల కోట్లను కేటాయించినట్లు తెలిసింది. అయితే దీనిపై ఆర్థిక శాఖ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

India allocate Huge amount for Vaccine
కరోనా టీకా కోసం భారీగా నిధులు కేటాయింపు
author img

By

Published : Oct 22, 2020, 6:20 PM IST

దేశ ప్రజలకు కరోనా వైరస్‌ను కట్టడి చేసే టీకాలు అందించేందుకు భారత ప్రభుత్వం రూ.50వేల కోట్ల(7 బిలియన్‌ డాలర్లు)ను కేటాయించిందని సమాచారం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశమైన భారత్ కొవిడ్ టీకాల కోసం ఈ మొత్తాన్ని వినియోగించనుందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సుమారు 130 కోట్ల జనాభా కలిగిన భారత్​లో ఈ టీకా వేసేందుకు ఒక్కో వ్యక్తికి ఆరు నుంచి ఏడు డాలర్ల మొత్తం ఖర్చవుతుందన్న అంచనాతో కేంద్రం ఈ మొత్తాన్ని పక్కన పెట్టినట్లు వెల్లడించాయి. దీనితో నిధుల కొరతకు అవకాశం ఉండకపోవచ్చని పేర్కొన్నాయి.

ఒక్కో డోసు విలువ ఎంతంటే?

ఆ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం..ఒక్కో వ్యక్తికి రెండు ఇంజెక్షన్ల కొవిడ్ టీకాను అందించాల్సిన అవసరం ఉందని భావిస్తుండగా, ఒక్కో డోసు విలువ రెండు డాలర్లు (దాదాపు రూ.150)గా ఉండనుందని అంచనా వేస్తున్నారు. మరో రెండు నుంచి మూడు డాలర్లు నిల్వ, పంపిణీకి ఖర్చవుతుందని లెక్కగట్టారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

కేసుల పెరుగుదలపై ఆందోళన

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత గరిష్ఠ స్థాయిని దాటిపోయిందని కేంద్రం నియమించిన కొవిడ్ ప్రత్యేక కమిటీ ఆదివారం వెల్లడించింది. అన్ని జాగ్రత్త చర్యలు కట్టుదిట్టంగా పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా దేశంలో కేసుల సంఖ్యను నియంత్రించవచ్చని కమిటీ పేర్కొంది. వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. దీనితో లాక్‌డౌన్‌కు స్వస్తి పలికి దాదాపుగా అన్ని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రం అనుమతినిచ్చింది. మరోవైపు పండుగల సీజన్‌ కూడా మొదలు కావడం వల్ల కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఇదీ చూడండి:కరోనా సెరో సర్వేలో షాకింగ్ నిజాలు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.