ETV Bharat / business

కొవిడ్​తో అధిక ప్రయాణాలు ఆగాయ్​: ఈవై సర్వే - ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణాలు

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా.. 9 నెలల నుంచి అత్యధిక ప్రయాణాలు ఆగిపోయాయని ఈవై సర్వే తెలిపింది. చైనా, అమెరికాతో పోలిస్తే భారత్​లో ప్రయాణాలు భారీగా తగ్గినట్లు వెల్లడించింది. దేశంలో విధించిన కఠిన లాక్​డౌన్​ వల్లే ఈ క్షీణత నమోదైందని చెప్పింది.

India sees highest drop in work, social, household travels due to pandemic: Survey
కొవిడ్​తో అత్యధిక ప్రయాణాలు ఆగాయ్​:ఈవై సర్వే
author img

By

Published : Nov 27, 2020, 1:20 PM IST

ప్రపంచవ్యాప్తంగా గత 9 నెలల నుంచి కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో అత్యధిక ప్రయాణాలు ఆగిపోయాయని ఈవై సర్వే తెలిపింది. చైనా, అమెరికాతో కలిపి 9 దేశాల్లో పని, సామాజిక, గృహ ప్రయాణాల పరంగా చూస్తే భారత్‌లోనే ఎక్కువగా తగ్గిపోయినట్లు వెల్లడించింది.

"ఈ ఆరోగ్య సంక్షోభ సమయంలో ప్రయాణించేందుకు పలువురు తీవ్ర విముఖత చూపుతున్నారు. కార్యాలయాలకు సొంత వాహనాలపై వెళ్తున్నందున, వారికి కొంత స్వయం ప్రతిపత్తి లభించినట్లయింది. రాకపోకలకు వెచ్చించే సమయం కూడా మిగులుతోంది."

-- ఈవై సర్వే

భారత్‌ విషయానికొస్తే పని ప్రయాణాలు (వర్క్‌ ట్రావెల్‌) సుమారు 69 శాతం క్షీణించగా, సామాజిక ప్రయాణాలు 59 శాతం, గృహ ప్రయాణాలు 58 శాతం మేర క్షీణించినట్లు ఈవై వెల్లడించింది. స్వీడన్‌ లాంటి కోటి జనాభా ఉన్న దేశంతో సమానంగా 138 కోట్ల జనాభా ఉన్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం 70 శాతం క్షీణతను నమోదు చేయడం గమనార్హం.

లాక్​డౌన్​ వల్లే..

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించడం వల్ల క్షీణత నమోదైందని ఈవై వివరించింది. ఒక్కో వ్యక్తి వారానికి చేసే సరాసరి ప్రయాణ సమయం 40 శాతం తగ్గిందని, ఇది 6 గంటల నుంచి 3.7 గంటలకు పరిమితమైందని తెలిపింది. మొబిలిటీ కన్జూమర్‌ ఇండెక్స్‌లో భాగంగా ఈ నెలలోనే ఈవై ఈ సర్వే నిర్వహించింది.

భారత్‌, చైనా, అమెరికా, యూకే వంటి 9 దేశాల్లో కొవిడ్‌-19 ప్రభావం వినియోగదార్లపై ఏ మేరకు పడిందనే కోణంలో 3,300 మంది వినియోగదార్లతో ఈ సర్వే చేపట్టింది. సరాసరి వార ప్రయాణ సమయం భారత్‌, సింగపూర్‌ల్లో గరిష్ఠంగా తగ్గినట్లు పేర్కొంది.

ఇదీ చూడండి:ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.