ETV Bharat / business

'2020-21 క్యూ3లో వృద్ధి రేటు క్షీణత 0.8 శాతమే'

author img

By

Published : Dec 24, 2020, 5:53 PM IST

భారత వృద్ధి రేటు అంచనాను సానుకూలానికి సవరించింది ఇండియా రేటింగ్స్. 2020-21లో వృద్ధి రేటు క్షీణత 7.8 శాతంగా ఉండొచ్చని ప్రకటించింది. క్యూ3లో వృద్ధి రేటు క్షీణత 0.8 శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు ఆశ్చర్యకర రీతిలో పుంజుకున్న నేపథ్యంలో ఈ సవరణలు చేసినట్లు వెల్లడించింది.

India ratings on India growth rate
దేశ వృద్ధి రేటుపై ఇండియా రేటింగ్స్ అంచనాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ వృద్ధి రేటు క్షీణత 7.8 శాతంగా నమోదవ్వచ్చని ఇండియా రేటింగ్స్ గురువారం విడుదల చేసిన అంచనాల్లో పేర్కొంది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో గతంలో ఈ అంచనా -11.8 శాతంగా ఉంది.

పరిస్థితులు మెరుగవుతాయన్న ఆశలతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో భారత్ ఏకంగా 9.6 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

2020-21 క్యూ2లో వృద్ధి రేటు రికవరీ ఊహించినదానికన్నా వేగంగా జరగిన కారణంగా వార్షిక వృద్ధి రేటు అంచనాను సానుకూలానికి సవరించినట్లు ఇండియా రేటింగ్స్ పేర్కొంది.

సామూహిక వ్యాక్సినేషన్​ జరిగే వరకు కరోనా వల్ల నెలకొన్న గడ్డు పరిస్థితులు పూర్తిగా తొలగిపోయినట్లు భావించలేమని ఇండియా రేటింగ్స్​ పేర్కొంది.

కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండం, వ్యాక్సిన్ ఆశాల నేపథ్యంలో.. 2020-21 క్యూ3లో వృద్ధి రేటు క్షీణత 0.8 శాతంగా, చివరి త్రైమాసికంలో 0.3 శాతంగా నమోదవ్వచ్చని అంచనా వేసింది.

వ్యవసాయమే సానుకూలం..

కరోనా వల్ల విధించిన లాక్​డౌన్​లో వ్యవసాయ రంగం మాత్రమే సానుకూలంగా వృద్ధిని కనబర్చిందని ఇండియా రేటింగ్స్ వెల్లడించింది. వర్షాలు సరైన సమయాని పడటం కూడా ఇందుకు కలిసొచ్చినట్లు వివరించింది. ఆ సానుకూలతలు ఇంకా కొనసాగుతున్నందున.. 2020-21లో వ్యవసాయ రంగం 3.5 శాతం వృద్ధి రేటును నమోదు చేసే అవకాశముందని పేర్కొంది. ఇదేస సమయంలో పరిశ్రమలు, సేవా రంగాలు వరుసగా 10.3 శాతం, 9.8 శాతం క్షీణతను నమోదు చేయొచ్చని పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్, టోకు ద్రవ్యోల్బణం వరుసగా.. 6.8 శాతం, -0.3 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది ఇండియా రేటింగ్స్.

ఇదీ చూడండి:'అయిదేళ్ల అజెండాతో ముందడుగు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.