ETV Bharat / business

'కరోనాపై పోరులో కేంద్రం రివర్స్ గేర్​!' - మాస్క్​ల ధరలకు రెక్కలు

కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న ప్రస్తుత సమయంలో ఇటీవల కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. మాస్క్​లు, శానిటైజర్లను నిత్యవసరాల జాబితా నుంచి తొలగించడం విమర్శలకు తావిచ్చింది. కరోనా వ్యాప్తి ఆరంభ దశలో ధరలు నియంత్రించిన కేంద్రం.. 4 నెలల గడవక ముందే ఎందుకు వైఖరి మార్చుకుంది? ఈ నిర్ణయాన్ని నిపుణులు ఎలా విశ్లేషిస్తున్నారు?

Essential commodities
నిత్యవరాల జాబితా నుంచి శానిటైజర్ల తొలగింపు
author img

By

Published : Jul 12, 2020, 5:23 PM IST

అది మార్చి 20. అప్పుడు దేశంలో కరోనా కేసుల సంఖ్య 194. మరణాలు 4. అలాంటి సమయంలో కీలక నిర్ణయం తీసుకుంది నరేంద్రమోదీ ప్రభుత్వం. కరోనాపై పోరాటంలో సామాన్యుల అస్త్రాలైన ఫేస్​ మాస్క్​, శానిటైజర్​ను నిత్యవసరాల జాబితాలో చేర్చింది. ప్రజాహితం కోసం తీసుకున్న ఈ నిర్ణయం గురించి అప్పట్లో ట్విట్టర్​లో చాలా గర్వంగా ప్రకటించారు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్​ విలాస్ పాసవాన్.

నాలుగు నెలలైనా గడవలేదు. ఇప్పుడు దేశంలో కరోనా కేసుల సంఖ్య దాదాపు ఎనిమిదిన్నర లక్షలు. మృతుల సంఖ్య సుమారు 23 వేలు. కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తున్న ఇలాంటి తరుణంలో రివర్స్ గేర్ వేసింది కేంద్రం. ఎందుకిలా? మాస్క్​లు, శానిటైజర్లను నిత్యవసరాల జాబితా నుంచి ఎందుకు తొలగించింది? ఇందుకు కేంద్రం చెబుతున్న కారణాలు ఏమిటి? నిపుణుల ఏమంటున్నారు?

అప్పుడు అలా... ఇప్పుడు ఇలా...

కరోనా వైరస్​ ప్రారంభ దశలో ఉన్నప్పుడు 100 మిల్లీలీటర్ల శానిటైజర్​ ధర రూ.50, రెండు లేయర్ల మాస్క్ ధర రూ.8, మూడు లేయర్ల మాస్క్ ధర రూ.10 దాటొద్దని వాటి తయారీదారులకు స్పష్టంచేసింది వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ నిర్ణయంపై అప్పట్లో అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి.

దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు అంటువ్యాదుల చట్టం 1897 కింద.. జన సంచారంలో మాస్క్​లు ధరించడం తప్పనిసరి చేశాయి. ఈ నిబంధనలు పాటించని వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నాయి. ఇందుకోసం మాస్క్​ల ధరలు నియంత్రించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు.

అయితే ఇటీవల లభ్యతకు కొరత లేదనే కారణంతో నిత్యవసరాల జాబితా నుంచి వాటిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. ఈ అంశంపై ఇప్పుడు విపక్షాలు, నిపుణుల నుంచి వ్యతిరేకత వస్తోంది.

విపక్షాలకు కొత్త అస్త్రం

మాస్క్​లు​, శానిటైజర్​ సహా మరికొన్ని తప్పనిసరి వస్తువులను జీఎస్​టీ పరిధి నుంచి తొలగిచాలని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ అప్పట్లో ప్రభుత్వాన్ని పదేపదే డిమాండ్ చేశారు. అయితే మోదీ ప్రభుత్వం.. ఏకంగా వాటి ధరలపై పరిమితి విధించి విపక్షాలు విమర్శించేందుకు వీలు లేకుండా చేసింది. కానీ ఇప్పుడు నిత్యవసరాల జాబితా నుంచి శానిటైజర్లను, మాస్క్​లను తొలగించడం వల్ల... మళ్లీ ప్రత్యర్థులు చెలరేగేందుకు స్వయంగా అవకాశం కల్పించినట్లయింది.

నిపుణుల వాదన ఇలా...

ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర ఔషధాల ధరలను నియంత్రించే.. జాతీయ ఫార్మాసూటికల్స్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్​పీపీఏ)కే శానిటైజర్లు, మాస్క్​ల ధరలు నిర్ణయించే అధికారులు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నిత్యవసరాల జాబితా నుంచి ఫేస్​మాస్క్​లు, శానిటైజర్​లను తొలిగించిన కారణంగా ఎన్​పీపీఏ వాటిని నియంత్రించడం సాధ్యం కాదని డ్రగ్ యాక్షన్​ నెట్​వర్క్ కో-కన్వినర్​ మాలిని ఐసోలా అంటున్నారు.

ఆంక్షలున్నా అడ్డగోలు ధరలు..

లోకల్​ సర్కిల్స్​ అనే సంస్థ చేసిన సర్వే ద్వారా మేలో కూడా శానిటైజర్ల లభ్యత లేదని తేలింది. సర్వేలో పాల్గొన్న 8 వేల మందిలో సగానికిపైగా ఇదే విషయం చెప్పారు. 7 వేల మందిలో మూడో వంతు మాత్రమే ప్రభుత్వం తగ్గించిన ధరల ప్రకారం శానిటైజర్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.

చాలా మంది ప్రభుత్వం చెప్పిన ధరల కన్నా మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ ధరకు శానిటైజర్లను కొనుగోలు చేసినట్లు చెప్పడం గమనార్హం. ధరలపై నియంత్రణ ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే.. అదుపు లేకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.

రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో మాస్క్​లు, శానిటైజర్లను ఇంకొన్నాళ్లు నిత్యావసరాల జాబితాలో ఉంచడమే మంచిదని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియ 'ఈటీవీ భారత్'​తో అన్నారు.

నిత్యావసరాల జాబితా నుంచి తొలగిచడం ద్వారా రెండు లేయర్ల మాస్క్​లు, మూడు లేయర్ల మాస్క్​లు, ఎన్​-95 మాస్క్​ల ధరలు భారీగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. ఈ విషయంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని సూచిస్తున్నారు.

(రచయిత: కృష్ణానంద్ త్రిపాఠి, సీనియర్ పాత్రికేయులు)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.