ETV Bharat / business

పెరిగిన ధరలతో బంగారు రుణాలకు భలే డిమాండ్! - బంగారం రుణాల్లో భారీ వృద్ధి

కరోనా కాలంలో బంగారం రుణాలకు డిమాండ్ భారీగా పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు ఇందుకు కారణంగా వెల్లడించింది. పెరిగిన ధరలతో ఎక్కువ రుణ విలువ లభించడం వల్ల రుణగ్రహీతలు, తక్కువ ఎల్​టీవీతో రుణ దాతలు లబ్ధిపొందారని పేర్కొంది.

World Gold Council on Gold loan Demand
పెరిగిన ధరలతో బంగారు రుణాలకు భారీ డిమాండ్
author img

By

Published : Nov 10, 2020, 4:13 PM IST

రికార్డు స్థాయిలో పెరిగిన పసిడి ధరలు.. కరోనా కాలంలో బంగారు రుణాల డిమాండ్​ను భారీగా 28.8 శాతం పెంచాయి. ఫలితంగా బంగారు రుణాలిచ్చే ప్రధాన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ఏయూఎం (అసెట్ అండర్​ మేనేజ్​మెంట్​) కూడా భారీగా పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) నివేదిక తెలిపింది.

పెరిగిన డిమాండ్​తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బంగారు రుణాల విలువ రూ.4,051 బిలియన్లు దాటొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సతరం ఈ విలువ రూ.3,448 బిలియన్లుగా తెలిపింది.

పెరిగిన పసిడి ధరలతో.. రుణ గ్రహీతలు అధిక రుణ విలువ పొంది లాభపడితే.. రుణదాతలు తక్కువ లోన్​ టూ వాల్యూ (ఎల్​టీవీ) నిష్పత్తితో లబ్ధిపొందారని పేర్కొంది డబ్ల్యూజీసీ.

ఏయూఎం వృద్ధి ఇలా..

దేశంలో ప్రధాన బంగారు రుణ సంస్థలైన ముత్తూట్ ఫినాన్స్, మణప్పురం ఫినాన్స్ కంపెనీల ఏయూఎం 2020-21 క్యూ2లో గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే వరుసగా 15 శాతం, 33.4 శాతం రుణాలు పెరిగినట్లు ప్రకటించాయి.

ఇదే కాలానికి.. కేరళకు చెందిన ఫెడరల్ బ్యాంక్​ బంగారు రుణాల ఏయూఎం ఏకంగా 36 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:ఉల్లి ఘాటు తగ్గకముందే.. వంట నూనెల మంట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.