రాష్ట్రాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిహారం చెల్లింపు అంశంపై చర్చించేందుకు.. జీఎస్టీ మండలి సోమవారం మరోసారి భేటీ కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ అంశంపై చర్చకు రావడం ఇది వరుసగా మూడో సారి. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
పరిహారంపై ఏకాభిప్రాయానికి ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలన్న భాజపాయేతర పాలిత రాష్ట్రాలు సూచించిన అంశంపై చర్చించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత వారం సమావేశంలో చర్చాంశాలు..
గత వారం జరిగిన 42వ సమావేశంలో కార్లు, పొగాకు వంటి ఉత్పత్తులపై సర్ ఛార్జీని 2022 వరకు పెంచాలని మండలి నిర్ణయం తీసుకుంది. కానీ రాష్ట్రాలకు కలిగే జీఎస్టీ నష్టాన్ని భర్తీ చేసే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు.
- గత వారం జీఎస్టీ మండలి భేటీ పూర్తి వివరాలను ఇక్కడ చూడండి