ETV Bharat / business

సెప్టెంబర్​లో భారీగా పెరిగిన జీఎస్టీ రాబడులు - జీఎస్టీ వార్తలు

వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయం సెప్టెంబర్​లో ఈ ఆర్థిక సంవత్సర గరిష్ఠ స్థాయిని తాకింది. గత ఏడాది సెప్టెంబర్​తో పోల్చితే 4 శాతం వృద్ధితో రూ.95,480 కోట్లు సమకూరినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టు నెలతో పోల్చితే 9వేల కోట్ల రూపాయలు అధికంగా రాబడులు వచ్చాయి.

GST collections
సెప్టెంబర్​లో భారీగా పెరిగిన జీఎస్టీ రాబడులు
author img

By

Published : Oct 1, 2020, 4:21 PM IST

కరోనా కారణంగా ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా వస్తు సేవల పన్ను(జీఎస్టీ) రాబడులు గణనీయంగా తగ్గాయి. అయితే.. క్రమంగా పుంజుకుంటూ ఈ ఆర్థిక ఏడాదిలో తొలిసారి సెప్టెంబర్​లో జీఎస్టీ వసూళ్లు గరిష్ఠస్థాయిని తాకాయి. సెప్టెంబర్​లో రూ.95,480 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది 2019, సెప్టెంబర్​లో జీఎస్టీ వసూళ్లతో పోల్చితే.. ఈ ఏడాది సెప్టెంబర్​లో 4 శాతం వృద్ధి నమోదు చేసినట్లు తెలిపింది.

" 2020, సెప్టెంబర్​లో జీఎస్టీ వసూళ్లు రూ. 95,480 కోట్లు. అందులో కేంద్ర జీఎస్టీ రూ.17,741 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ రూ.23,131 కోట్లు, ఐజీఎస్టీ రూ.47,484 కోట్లు, సెస్​ రూ.7,124 కోట్లు ఉన్నాయి.

- ఆర్థిక శాఖ.

గతంలో ఇలా...

  • ఏప్రిల్​- రూ.32,172కోట్లు
  • మే- రూ.62,151 కోట్లు
  • జూన్​- రూ. 90.917కోట్లు
  • జులై- రూ.87,422కోట్లు
  • ఆగస్టు- రూ.86,449 కోట్లు

ఇదీ చూడండి: డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలకు అదనపు భద్రత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.