ETV Bharat / business

'రూ.2కోట్ల లోపు మూలధనం​ ఉంటే చిన్న కంపెనీలే' - బడ్జెట్​ న్యూస్ లేటెస్ట్​

చిన్న కంపెనీలకు ఊరటనిచ్చేలా బడ్జెట్​లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కీలక ప్రకటనల చేశారు. రూ.2 కోట్లకు క్యాపిటల్​ ఉన్న సంస్థలను సైతం చిన్న కంపెనీలుగా పరిగణించనున్నట్లు తెలిపారు. బ్యాంకులకు ఈ సారి బడ్జెట్​లో రూ.20 వేల కోట్ల మూలధన సాయాన్ని ప్రకటించారు.

revise definition of small companies
చిన్న కంపెనీల నిర్వచణం మార్పు
author img

By

Published : Feb 1, 2021, 1:49 PM IST

Updated : Feb 1, 2021, 2:44 PM IST

కంపెనీలకు సంబంధించి బడ్జెట్ 2021లో భారీ సంస్కరణలు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గతంలో రూ.50 లక్షల మూలధనమున్న కంపెనీలను చిన్న కంపెనీలుగా నిర్వచిస్తుండగా.. ఆ పరిమితిని రూ.2 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు.

జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్​ ఫ్రేమ్​వర్క్​ మరింత పటిష్టం చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.

నియంత్రణ పరమైన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి 2021-22లో రూ.20 వేల కోట్లు చొప్పించనున్నట్లు తెలిపారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా రూ.20 వేల కోట్లను మూలధన సహాయాన్ని ప్రకటించింది కేంద్రం. బ్యాంకుల ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేసేందుకు కూడా ఈ మొత్తం ఉపయోగపడుతుందని వివరించారు.

ఫినాన్షియల్ ప్రొడక్ట్స్​ కోసం ఇన్వెస్టర్​ ఛార్టర్​ ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.

ఇదీ చూడండి:బడ్జెట్​ ప్రత్యేక యాప్​ ఫీచర్లు ఇవే..

Last Updated : Feb 1, 2021, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.