ETV Bharat / business

వచ్చే 6 నెలల్లో రూ.5 లక్షల కోట్ల రుణం: కేంద్రం - కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ

కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు, ఆదాయ వ్యత్యాసానికి తగ్గించేందుకు రుణం తీసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో రూ.5.03 లక్షల కోట్లు రుణాన్ని సేకరించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Govt borrowings
కేంద్ర రుణాలు
author img

By

Published : Sep 28, 2021, 7:14 AM IST

కొవిడ్​ కారణంగా క్షీణించిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో రూ.5.03 లక్షల కోట్ల రుణం తీసుకోవడానికి సిద్ధమైంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12.05 లక్షల కోట్ల రుణాన్ని బహిరంగ మార్కెట్‌ నుంచి సమీకరించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం..అందులో తొలి ఆరునెలల్లో రూ.7.24 లక్షల కోట్లు (60శాతం) సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రూ.7.02 లక్షల కోట్లే సేకరించింది.

మిగిలిన రూ.5.03 లక్షల కోట్లను వచ్చే ఆరునెలల్లో సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 21 వారాల్లో.. వారానికి రూ.23/24 వేల కోట్ల చొప్పున తీసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం 2 (4%), 5 (11.9%), 10 (28.4%), 14 (17.9%), 30 (13.9%), 40 (15.1%) ఏళ్ల కాల పరిమితితో బాండ్లు విడుదల చేయనుంది.

ఇదీ చూడండి: తొమ్మిది కీలక రంగాల్లో 3.08 కోట్ల ఉద్యోగాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.