ETV Bharat / business

కొత్త ఏడాదిలో బంగారం ధరకు రెక్కలు! - భౌతికంగా పసిడి డిమాండ్ తగ్గించిన కరోనా

కరోనా కారణంగా ఈ ఏడాది పెట్టుబడి సాధనాలన్నీ గతంలో ఎన్నడూ లేనంతగా ఒడుడొదుకులు ఎదుర్కొన్నాయి. సంక్షోభ కాలంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచే పసిడి ఈ సారి కూడా మంచి లాభాలను ఇచ్చింది. అయితే వచ్చే ఏడాది కొవిడ్ వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి 2021లో పసిడి ఎలా స్పందించొచ్చు? విశ్లేషకులు ఏమంటున్నారు?

Gold price rise to new Record level by next Year
కొత్త సంవత్సరం సరికొత్త గరిష్ఠాలకు పసిడి
author img

By

Published : Dec 27, 2020, 5:25 PM IST

ఏదైనా సంక్షోభమొస్తే స్టాక్ మార్కెట్లు, ఇతర పెట్టుబడి సాధనాలు ఒడుదొడుకులు ఎదుర్కోవడం సర్వసాధారణం. అలాంటి సమయాల్లో బంగారం మాత్రం అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ ఏడాది పసిడిపై పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఫలితంగా ధరలూ రికార్డు స్థాయిలను తాకాయి. అయితే వచ్చే ఏడాదీ పసిడి ధరల పరుగులు కొనసాగొచ్చని చెబుతున్నారు విశ్లేషకులు.

2021లో 10 గ్రాముల బంగారం ధర రూ.63,000 మార్క్​ దాటొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. అమెరికా డాలర్​ బలహీనపడుతుండటం, ఇటీవలి ఉద్దీపన నేపథ్యంలో ఈ స్థాయిలో పసిడి ధర పెరగొచ్చని భావిస్తున్నారు.

రికార్డు స్థాయికి ధరలు

ఈ ఏడాది కరోనా వైరస్ వల్ల నెలకొన్న ప్రపంచవ్యాప్త సంక్షోభం వల్ల పసిడిపై పెట్టుబడులకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్​ (ఎంసీఎక్స్)​లో 10 గ్రాముల పుత్తడి ధర జీవనకాల గరిష్ఠమైన రూ.56,191కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,075 డాలర్లుగా నమోదైంది.

ప్రపంచ ద్రవ్య విధానాల్లో కీలక మార్పులు, తక్కువ వడ్డీ రేట్లు వంటివి పసిడి ధరలు 2019 మధ్యలో భారీగా పెరిగేందుకు కారణమయ్యాయి. ఈ ప్రభావం మదుపరులకు పసిడిని మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా చేసింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో 2020లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.39,100 వద్ద, అంతర్జాతీయంగా ఔన్సుకు 1,517 డాలర్ల వద్ద ప్రారంభమైంది.

కరోనా వల్ల ఏర్పిడిన పరస్థితులతో ఈ ఏడాదే.. 10 గ్రాముల పసిడి ధర ఒకానొక దశలో రూ.38,400కి పడిపోయి.. తిరిగి రూ.56,191 వద్దకు చేరింది. పెట్టుబడులకు పోత్సాహమందించే ఉద్దీపనలు ఇందుకు కారణమైనట్లు కమెట్రెండ్జ్​ రిస్క్ మేనేజ్​మెంట్​ సర్వీసెస్​ సీఈఓ జ్ఞానశేఖర్​ త్యాగరాజన్​ పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సిన్​, కొవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్నట్లు సంకేతాలు వస్తున్నా.. రానున్న రోజుల్లో పసిడి జోరు కొనసాగొచ్చని తెలిపారు త్యాగరాజన్​.

బులియన్ మార్కెట్లు మరింత పైకి..

త్వరలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్​కు సెనెట్​లో తక్కువ మెజారిటీ ఉంది. ఈ కారణంగా సంస్కరణలు అమలు చేయడం ఆయనకు కష్టతరమవుతుందని త్యాగరాజ్​ పేర్కొన్నారు. ఈ ప్రభావం బులియన్ మార్కెట్లను మరింత ముందుకు నడిపించొచ్చని అన్నారు.

'పుత్తడికి భౌతిక డిమాండ్ భారత్​, చైనాలో 2021లో కీలక స్థాయిలకు చేరొచ్చు. గత కొన్నాళ్లుగా మందకొడిగా ఉన్న పసిడి ధర వచ్చే ఏడాది భారీగా పుంజుకోవచ్చు. ఈ సారి 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేల మార్క్​ దాటొచ్చని భావిస్తున్నాం.' అని జ్ఞానశేఖర్​ త్యాగరాజన్ వివరించారు.

వచ్చే ఏడాది కామెక్స్​లో ఔన్సు బంగారం ధర 2,150 డాలర్ల నుంచి 2,390 డాలర్ల వరకు చేరొచ్చని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్ పరిశోధకులు తపన్​ పటేల్​ అన్నారు. ఎంసీఎక్స్​లో 10 గ్రాముల పసిడి ధర రూ.57 వేల నుంచి రూ.63 వేల వరకు పెరగొచ్చని తెలిపారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలు..

అధిక ధరలు, కరోనా వల్ల ఏర్పడిన రవాణా ఇబ్బందుల కారణంగా ఈ ఏడాది పసిడికి వినియోగదారుల డిమాండ్ భారీగా తగ్గినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఎండీ(ఇండియా) సోమసుందరం తెలిపారు. సెప్టెంబర్​ వరకు పసిడి వినియోగదారు డిమాండ్ 49 శాతం తగ్గినట్లు తెలిపారు. ధరలు కాస్త తగ్గుముఖం పట్టడం, లాక్​డౌన్​ సడలింపుల వల్ల అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ కాస్త రికవరీ అవుతున్నట్లు వివరించారు.

మొత్తం మీద 2019తో పోలిస్తే 2020లో పసిడి డిమాండ్ భారీగా తగ్గినట్లు వెల్లడించారు. కరోనా వల్ల ఈ ఏడాది డిమాండ్ పడిపోయినా.. వచ్చే ఏడాది మాత్రం పసిడి పరుగులు కొనసాగుతాయని డబ్ల్యూజీసీ ఆశాభావం వక్తం చేసింది. తక్కువ వడ్డీ రేట్లు, బలహీన పడుతున్న డాలర్ విలువ​ సహా అనేక ఇతర కారణాలు పసిడి డిమాండ్​కు ఊతమందించొచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:డిసెంబర్​లోనూ భారత్​లోకి ఎఫ్​పీఐల జోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.