ETV Bharat / business

2019-20లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతమే

author img

By

Published : Jan 7, 2020, 6:09 PM IST

Updated : Jan 7, 2020, 6:50 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను వెలువరించింది కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని లెక్కగట్టింది.

GDP seen dropping to 5 pc in 2019-20: Govt data
2019-20లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతమే

2019-20 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిరేటుకు సంబంధించి ముందస్తు అంచనాలను వెలువరించింది కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరంలో 5 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ వృద్ధి రేటు గతేడాదితో పోలిస్తే 1.8 శాతం తక్కువ కావడం గమనార్హం. 2018-19 సంవత్సరం వృద్ధి రేటు 6.8శాతం.

తయారీ రంగ ప్రభావం

తయారీ రంగం నెమ్మదించడం వల్ల జీడీపీ వృద్ధిపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.2 శాతంగా ఉన్న తయారీ రంగ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరానికి 2 శాతానికి తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. వ్యవసాయం, నిర్మాణ రంగం, విద్యుత్​, గ్యాస్ వంటి రంగాల్లో ప్రగతి పడకేయడం కూడా ఈ క్షీణతకు కారణమని గణాంకాల కార్యాలయం పేర్కొంది. మైనింగ్, ప్రజా పరిపాలన, రక్షణ రంగాలు స్వల్ప వృద్ధి కనబర్చాయని స్పష్టం చేసింది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Jan 7, 2020, 6:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.