ETV Bharat / business

2018-19 వృద్ధి రేటు సవరణ- 6.1శాతానికి తగ్గింపు

వ్యవసాయం, తయారీ, గనుల రంగం వృద్ధిలో క్షీణతతో కేంద్ర గణాంక కార్యాలయం 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును సవరించింది. 6.8శాతం ఉండగలదని 2019 జనవరిలో ప్రకటించిన గణాంక కార్యాలయం తాజాగా దాన్ని 6.1శాతానికి తగ్గించింది.

author img

By

Published : Jan 31, 2020, 8:37 PM IST

Updated : Feb 28, 2020, 5:04 PM IST

Real GDP
Real GDP

ఆర్థిక సంవత్సరం 2018-19 వృద్ధి రేటును జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్​ఎస్ఓ) సవరించింది. తయారీ, గనుల రంగాల క్షీణత కారణంగా 6.8 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. ఈ మేరకు సవరించిన గణాంకాలను విడుదల చేసింది ఎన్​​ఎస్ఓ.

"2011-12 ధరల్లో లెక్కిస్తే వాస్తవ జీడీపీ.. 2018-19లో 139.81 లక్షల కోట్లు, 2017-18లో 131.75 లక్షల కోట్లుగా ఉంది. ఫలితంగా 2018-19లో 6.1 శాతం, 2017-18లో 7.1 శాతం పెరుగుదల నమోదైంది."

-జాతీయ గణాంకాల కార్యాలయం

తయారీ, గనుల రంగాల క్షీణత..

2019 జనవరిలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2017-18లో వాస్తవ జీడీపీ 131.80 లక్షల కోట్లతో 7.2 శాతం వృద్ధి రేటు ఉంది. దీనికి ప్రధాన కారణం వ్యవసాయం, అటవీ, మత్స్య పరిశ్రమ, గనులు, తయారీ రంగాల్లో వృద్ధి క్షీణతేనని ఎన్​ఎస్​ఓ స్పష్టం చేసింది.

నికర జాతీయ ఆదాయం

ప్రస్తుత ధరల్లో లెక్కిస్తే.. నామమాత్రపు నికర జాతీయ జాతీయం 2018-19లో 167.89 లక్షల కోట్లు (10.8 శాతం వృద్ధి) ఉండగా.. 2017-18లో 151.5 లక్షల కోట్లు (11.2శాతం వృద్ధి) నమోదైంది.

తలసరి ఆదాయం

ప్రస్తుత ధరలతో పోల్చి లెక్కిస్తే.. తలసరి ఆదాయం 2017-18లో రూ.1,15,293, 2018-19లో రూ.1,26,521గా నమోదు చేసింది ఎన్​ఎస్​ఓ.

ఇదీ చూడండి: ఆర్థిక సర్వే 2019-20లోని కీలకాంశాలు ఇవే..

Last Updated : Feb 28, 2020, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.