ETV Bharat / business

ప్రతికూలానికి భారత వృద్ధి అంచనాలు: ఫిచ్​

కరోనా నేపథ్యంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులతో దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. రేటింగ్ ఏజెన్సీలు.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలు ప్రతికూలంగా ఉన్నట్లు తాజా నివేదికల్లో పేర్కొంటున్నాయి. 2020లో దేశ వృద్ధిపై ఫిచ్​, ఆసియా దేశాలపై ఏడీబీ విడుదల చేసిన అంచనాలు ఇలా ఉన్నాయి.

fitch cut India rating
భారత రేటింగ్​కు ఫిచ్ కోత
author img

By

Published : Jun 18, 2020, 12:20 PM IST

భారత వృద్ధి అంచనాలను స్థిరం నుంచి ప్రతికూలానికి(నెగటివ్​) మార్చింది ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్. కరోనా వైరస్​తో నెలకొన్న పరిస్థితులు దేశ వృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేయొచ్చని తాజా అంచనాల్లో వెల్లడించింది.

దీర్ఘకాలిక విదేశీ మారకపు జారీ రేటింగ్​ను స్థిరత్వం నుంచి ప్రతికూలంగా సవరించింది. ప్రస్తుతం రేటింగ్​ను 'బీబీబీ -'గా ఉంచింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వద్ధి రేటు 5 శాతం మేర క్షీణిస్తుందని అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్​కు సానుకూలంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2021-22లో భారత్ 9.5 శాతం జీడీపీ రేటును సాధించే వీలుందని పేర్కొంది.

ఈ సారికి స్వల్ప వృద్ధే...

ఆసియాలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ ఏడాది స్వల్ప వృద్ధిని మాత్రమే సాధిస్తాయని ఏషియన్ డెవలప్​మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. భారత వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం 4 శాతం క్షీణించొచ్చని తాజా నివేదికలొ పేర్కొంది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో వృద్ధిపై ప్రభావం పడనున్నట్లు తెలిపింది.

కొవిడ్​ నియంత్రణకు తీసుకునే చర్యలు ఆర్థిక కార్యకలాపాలను, బాహ్య డిమాండ్​ను తగ్గించొచ్చని పేర్కొంది.

హాంకాంగ్, రిపబ్లిక్​ ఆఫ్ కొరియా, సింగపూర్, తైపీ మినహా అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలు ఈ ఏడాది 0.4 శాతం వృద్ధి రేటు మాత్రమే సాధించొచ్చని తెలిపింది. 2021లో ఇది 6.6 శాతానికి పెరగొచ్చని అభిప్రాయపడింది.

కరొనా కారణంగా దక్షిణాసియా.. 2020 వృద్ధి రేటు క్షీణతను ఏప్రిల్​లో అంచనా వేసిన 4.1 శాతం నుంచి 3 శాతానికి సవరించింది ఏడీబీ. 2021 వృద్ధి రేటు అంచనాను 6 శాతం నుంచి 4.9 శాతానికి మార్చింది.

ఇదీ చూడండి:పన్నెండో రోజూ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.