సామాన్యులు బడ్జెట్‌ను సులభంగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం సరికొత్త ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 22 నుంచి సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేయనుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ.
'#ArthShastri' అనేపేరుతో ఆర్థిక పరమైన అంశాలను సులభంగా సామాన్యులకు, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా.. యానిమేటెడ్ వీడియోలను రూపొందించనున్నట్లు ఆర్థికశాఖ ప్రకటించింది. గత ఏడాది బడ్జెట్ ముందూ ఇలాంటి ప్రయత్నం చేసిన విషయాన్ని గుర్తు చేసింది.
ప్రస్తుతం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మరోసారి ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది కేంద్రం.
"ప్రొఫెసర్ శాస్త్రీ క్లాస్‌లో ఆసక్తిగల విద్యార్థి ఆర్థ్ ఎలాంటి సందేహాలు అడిగాడు. అతను అడిగిన కఠినమైన ప్రశ్నలకు డాక్టర్.శాస్త్రీ తన తెలివితో ఎలా సమాధానం ఇచ్చారు. తెలుసుకోవాలంటే జనవరి 22 ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే క్లాస్‌ల కోసం ఇక్కడకు రండి. #ArthShastri" అనే ట్వీట్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పిన్ చేసింది.
-
Curious student Arth unpacks his box of questions in Prof. Shastri’s class. Let’s see how Dr. Shastri tackles his difficult questions with her sharp insight. Tune into this space to join the classes starting 22nd January @ 11am. #ArthShastri pic.twitter.com/XhQKaGBzsQ
— Ministry of Finance (@FinMinIndia) January 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Curious student Arth unpacks his box of questions in Prof. Shastri’s class. Let’s see how Dr. Shastri tackles his difficult questions with her sharp insight. Tune into this space to join the classes starting 22nd January @ 11am. #ArthShastri pic.twitter.com/XhQKaGBzsQ
— Ministry of Finance (@FinMinIndia) January 19, 2020Curious student Arth unpacks his box of questions in Prof. Shastri’s class. Let’s see how Dr. Shastri tackles his difficult questions with her sharp insight. Tune into this space to join the classes starting 22nd January @ 11am. #ArthShastri pic.twitter.com/XhQKaGBzsQ
— Ministry of Finance (@FinMinIndia) January 19, 2020
దీనితో పాటు బడ్జెట్ వాగ్దానాలపై.. '#HamaraBharosa' పేరుతో మరో ప్రచారం నిర్వహించనుంది ఆర్థిక మంత్రిత్వ శాఖ.
వాగ్దానాలు, పంపిణీ వాగ్దానం ప్రచారమూ.. 12 ప్రధాన ప్రాంతీయ భాషల్లో, ఆరోగ్య రంగం, మానవరహిత స్థాయి క్రాసింగ్, అందరికీ హౌసింగ్‌తో ప్రారంభం కానుంది.
దీనికి సంబంధించిన వివరాలు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచింది. ఈ రెండు ప్రచారాలు ఈ నెల 29 వరకు కొనసాగనున్నట్లు తెలిపింది.
ఇదీ చూడండి:పద్దు: ప్రకటనలు ఎన్నెన్నో.. అమలైనవి కొన్నే