ETV Bharat / business

జీఎస్​టీ పరిహారంపై ప్రతిష్టంభన - రాష్ట్రాలకు 20 వేల కోట్లు చెల్లించేందుకు జీఎస్​టీ మండలి

రాష్ట్రాలకు పరిహారం చెల్లింపుల అంశమే ప్రధాన అజెండాగా జరిగిన 42వ జీఎస్​టీ కౌన్సిల్‌ సమావేశం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసింది. పరిహారం చెల్లింపునకు సంబంధించి రాష్ట్రాల ముందు కేంద్రం ఉంచిన రెండు ఐచ్ఛికాల్లో 21 రాష్ట్రాలు మొదటి ఐచ్ఛికాన్ని ఎంచుకోగా.. కొన్ని రాష్ట్రాలు ఎలాంటి ఐచ్ఛికాన్ని ఎంచుకోలేదు. దీనిపై విస్తృతంగా చర్చించేందుకు జీఎస్​టీ మండలి మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 12న మరోసారి కౌన్సిల్‌ భేటీ జరగనుంది.

GST COUNCIL MEET LATEST NEWS
జీఎస్​టీ మండలి సమావేశం నిర్ణయాలు
author img

By

Published : Oct 5, 2020, 8:18 PM IST

Updated : Oct 6, 2020, 12:09 PM IST

రాష్ట్రాలకు వస్తు, సేవల పన్ను (జీఎస్​టీ) పరిహారం చెల్లింపుపై సోమవారం జరిగిన జీఎస్​టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు. కేంద్రం ప్రతిపాదించిన రెండు ప్రతిపాదనలలో.. మొదటిదానికి ఆంధ్రప్రదేశ్‌ సహా 21 రాష్ట్రాలు అంగీకరించగా.. తెలంగాణ, బంగాల్​, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు రెండు ప్రతిపాదనల్నీ తిరస్కరించాయి. చట్ట ప్రకారం పరిహార చెల్లింపు బాధ్యత కేంద్రానిదే కాబట్టి.. కేంద్ర ప్రభుత్వమే రుణం తీసుకుని తమకు చెల్లించాలని డిమాండ్‌ చేశాయి. దీనితో సమస్య పరిష్కారంలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు ఉపశమనం కలిగించేందుకు.. ఈ ఏడాది పరిహార సెస్సు రూపంలో వసూలైన రూ.20 వేల కోట్లను రాష్ట్రాలకు వెంటనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

మండలి సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భేటీలో చర్చించిన అంశాలను వివరించారు. '21 రాష్ట్రాలు ఆప్షన్‌-1 ఎంచుకున్నట్టు లేఖల ద్వారా స్పష్టం చేశాయి. కొన్ని రాష్ట్రాలు దీనికి ఇష్టపడలేదు. మరికొన్ని రాష్ట్రాలు మూడో ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపాయి. కేంద్రమే ఆర్‌బీఐ నుంచి రుణాలు తీసుకొని తమకు పరిహారం చెల్లించాలని కోరాయి. దీనిపై లోతుగా చర్చించాం. తదుపరి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలకు.. అవి ఎంపిక చేసుకున్న మొదటి ఆప్షన్‌ ప్రకారం రుణాలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని బిహార్‌ మంత్రి సుశీల్‌మోదీ కోరారు. ఒకవేళ భవిష్యత్తులో దానికి విరుద్ధమైన నిర్ణయం వస్తే.. ఆ మొత్తాన్ని వెనక్కు తీసుకోవచ్చని కూడా సూచించారు. కర్ణాటక, గోవా, అసోంలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి.

పరిహారం రూ.1.10 లక్షల కోట్లకు పెంపు

కరోనా సమయంలో రాష్ట్రాల ఆదాయంలో 10% బేస్‌ రేటు ఆధారంగా రక్షిత పన్ను(ప్రొటెక్టెడ్‌ ట్యాక్స్‌) లెక్కించాం. అయితే తమకు 7% మాత్రమే వస్తోందని రాష్ట్రాల నుంచి సమాచారం వచ్చింది. దీనితో ఆ లోటును భర్తీ చేస్తున్నాం. దానివల్ల ఆప్షన్‌-1 కింద రాష్ట్రాలకు రూ.97 వేల కోట్లకు బదులు రూ.1.10 లక్షల కోట్ల పరిహారం అందుతుంది. ఈ ఆప్షన్‌ కింద తీసుకున్న రుణాలపై వడ్డీని ఐదేళ్ల తర్వాత వసూలుచేసే సెస్‌ ద్వారా చెల్లించాలని నిర్ణయించాం.

ఈ రుణం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాదు..

జీఎస్​టీ పరిహారం కింద రాష్ట్రాలు తీసుకొనే రుణాలు.. వాటి ఆర్థిక బాధ్యత-బడ్జెట్‌ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధిలోకి రాకుండా చూస్తాం. అసలు, వడ్డీని రాష్ట్రాలు తమ జేబుల నుంచి చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి.. వాటిపై ఎలాంటి భారం ఉండదు. కొవిడ్‌ సమయంలో జీఎస్​టీ అమలుకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ కారణంగా ఏర్పడిన నష్టాన్ని రాష్ట్రాలు వెంటనే భర్తీ చేసుకునేలా తక్షణం రుణం తీసుకోవడానికి అనుమతిస్తున్నాం. దానిపై వడ్డీ, అసలు అంతా సెస్‌ ద్వారా చెల్లిస్తాం. అసాధారణ కొవిడ్‌ కారణంగా ఏర్పడిన నష్టాన్ని ఐదేళ్ల తర్వాత సెస్సు ద్వారా నేరుగా రాష్ట్రాలకు చెల్లిస్తాం. అందుకే సెస్‌ను 2022 తర్వాత కూడా అమలు చేయాలని తాజా సమావేశంలో నిర్ణయించాం. రాష్ట్రాలకు ఈ ఏడాది జీఎస్​టీతోపాటు కొవిడ్‌ కారణంగా ఏర్పడే నష్టాలను కచ్చితంగా చెల్లిస్తాం. చట్ట ప్రకారమే ఇప్పుడు పరిహారం చెల్లించడానికి సిద్ధపడ్డాం. మేం ఏ రాష్ట్రానికీ పరిహారాన్ని తిరస్కరించడం లేదు. ఆప్షన్‌ ఎంచుకోని రాష్ట్రాలకు ఏమీ లభించదన్న వార్తలు తప్పు. అలాంటి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదు. ఎవరికీ పరిహారాన్ని తిరస్కరించడం లేదు' అని మంత్రి వెల్లడించారు.

ఐజీఎస్​టీ సమస్యకు సూత్రీకరణతో పరిష్కారం..

దీర్ఘకాల సమస్యగా ఉన్న సమీకృత వస్తు, సేవల పన్ను (ఐజీఎస్​టీ) పంపిణీకి ఫార్ములాను రూపొందించినట్లు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇన్నాళ్లూ ఈ సూత్రీకరణ లేకపోవడం వల్ల తక్కువ అర్హత ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ నిధులు, ఎక్కువ అర్హత ఉన్న రాష్ట్రాలకు తక్కువ మొత్తాలు వెళ్లాయన్నారు. నూతన సూత్రీకరణ ప్రకారం.. తక్కువ మొత్తం పొందిన రాష్ట్రాలకు వారం రోజుల్లో రూ.24 వేల కోట్లు చెల్లిస్తామన్నారు. అర్హత పరిమితి కంటే ఎక్కువ మొత్తం పొందిన రాష్ట్రాల నుంచి మిగతా మొత్తాన్ని దశలవారీగా తిరిగి రాబడతామన్నారు.

ఆప్షన్‌-1కి అంగీకరించిన రాష్ట్రాలు:

ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, బిహార్‌, గోవా, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్‌, ఒడిశా, పుదుచ్చేరి, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌.

సెస్‌ బకాయిలు చెల్లించాలి

సెస్‌ రూపంలో జీఎస్​టీ మండలికి జమ అయిన రూ.30 వేల కోట్లను వెంటనే రాష్ట్రాలకు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. దీనికి సంబంధించి 6 నెలలుగా మూడు వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద రాష్ట్రాలకు ఇచ్చిన రుణ పరిమితిని జీఎస్​టీ పరిహారం చెల్లింపునకు ముడిపెట్టవద్దని కోరారు. ఐజీఎస్​టీ సర్దుబాటు, వార్షిక రిటర్న్‌ల దాఖలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి రూ.1000 కోట్ల ప్రోత్సాహకం రావాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూకుమార్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:లండన్​లో ఓలా క్యాబ్​ సేవలకు బ్రేకులు

Last Updated : Oct 6, 2020, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.