కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ బుధవారం నిర్ణయించింది. 2020లోనూ బెంచ్మార్క్ వడ్డీ రేట్లలో పెద్దగా మార్పు ఉండదని ఫెడ్ సంకేతాలిచ్చింది.
బెంచ్మార్క్ వడ్డీ రేట్ల శ్రేణి 1.5 నుంచి 1.75 శాతం మధ్యే కొనసాగనున్నట్లు తాజాగా స్పష్టం చేసింది.
నిరుద్యోగ సమస్య పెద్దగా లేకపోవడం, ద్రవ్యోల్బణం సానుకూలంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ఫెడ్ కమిటీ. ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం మూడుసార్లు వడ్డీ రేట్లు తగ్గించింది ఫెడరల్ రిజర్వు బ్యాంకు.
చైనాతో వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ అనిశ్చితి వంటి అంశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపించదన్న విషయాన్ని ఫెడ్ తాజా నిర్ణయం స్పష్టం చేస్తోంది.
ఇదీ చూడండి:మా పూర్వీకులది తమిళనాడే: బ్రిటన్ కుబేరుడు