ఎయిరిండియా, నాలుగు అనుబంధ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఎయిరిండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్‌గా నామకరణం చేసిన ఈ సంస్థకు... రూ. 29వేల464 కోట్ల రుణాలను బదిలీ చేయటానికి కూడా సమ్మతం తెలిపింది మంత్రి వర్గం.
నాలుగు అనుబంధ సంస్థలు ఎయిరిండియా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించినవి కాదు. ప్రస్తుతం ఎయిరిండియాకు రూ. 55,000 కోట్ల అప్పులున్నట్లు అంచనా.
సాప్ట్వేర్ ఉత్పత్తులకు జాతీయ విధానం
దేశంలో సాప్ట్వేర్ ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా జాతీయ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాప్ట్వేర్ ఉత్పత్తులకు భారత్‌ను కేంద్రంగా మార్చటం, 2025 లోపు 65 లక్షల ఉద్యోగాల సృష్టించాలని లక్ష్యంగా నిర్దేశించింది.
"భారత్‌లో ఐటీ ఆదాయం 16,800 కోట్ల డాలర్లు ఉంది. ఇందులో సాప్ట్వేర్ ఉత్పత్తుల ద్వారా వచ్చేది కేవలం 710 కోట్ల డాలర్లే. ప్రస్తుతం దేశం సాప్ట్వేర్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది" అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
ప్రపంచ స్థాయికి దిల్లీ ఎయిమ్స్...
ప్రపంచస్థాయి వైద్య విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దిల్లీ ఎయిమ్స్ పునరాభివృద్ధికి సూత్రప్రాయం అంగీకారం తెలిపింది కేంద్ర మంత్రి వర్గం.