ETV Bharat / business

'2020-21 వృద్ధి రేటు క్షీణత 8% లోపే!' - ఆర్థిక రికవరీపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అంచనాలు

కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకన్నా వేగంగా రికవరీ అవుతున్నట్లు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్షీణత 8 శాతం లోపే ఉండొచ్చని పేర్కొన్నారు.

Niti aayog positive predictions on Economy
వృద్ధి రైటుపై నీతి ఆయోగ్ సానుకూల అంచనాలు
author img

By

Published : Dec 6, 2020, 1:09 PM IST

వచ్చే అర్థిక సంవత్సరం (2021-22) చివరి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ముందున్న స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ వైస్​ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్షీణత కూడా 8 శాతం లోపే నమోదవ్వొచ్చని అంచనా వేశారు.

భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) కూడా.. కరోనా నేపథ్యంలో 2020-21లో జీడీపీ -9.5 శాతంగా నమోదవొచ్చన్న అక్టోబర్ అంచనాలను.. తాజాగా -7.5 శాతానికి సవరించింది.

భారత ఆర్థిక వ్యవస్థ సెప్టెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకన్నా వేగంగా రికవరీ అయ్యిందని రాజీవ్ కుమార్ తెలిపారు. తయారీ రంగం పుంజుకోవడం వల్ల క్యూ2లో వృద్ధి రేటు క్షీణత 7.5 శాతానికి పరిమితమైనట్లు వివరించారు.

అస్తుల విక్రయాల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం సమకూర్చుకునే లక్ష్యాలను చేరుకుంటామని రాజీవ్ తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 2020-21లో రూ.2.10 లక్షల కోట్ల ఆదాయం గడించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తుచేశారు.

నీతి ఆయోగ్.. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు రాజీవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సహజ వ్యవసాయాన్ని విస్తరించడం ద్వారా భారత వ్యవసాయ రంగం మరింత పోటీగా మారడం సహా, రైతులు ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు.

ఇదీ చూడండి:వ్యాక్సిన్ వార్తలు, ప్యాకేజీ ఆశలే మార్కెట్లకు కీలకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.