ETV Bharat / business

డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలా? ఇది మీ కోసమే..

కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారిలో చాలా మంది రిస్కు తీసుకునేందుకు ఇష్టపడరు. అలాంటి వారికి నిపుణులు సూచించే ఉత్తమ పెట్టుబడి సాధనం డెట్​ ఫండ్లు. ఇంతకి డెట్​ ఫండ్లు అంటే ఏమిటి? వాటిలో పెట్టుబడితో రిస్కు ఎందుకు తక్కువగా ఉంటుంది? వాటి ద్వారా వచ్చే రిటర్నులు ఎలా ఉంటాయి? డెట్ ఫంఢ్లలో పెట్టుబడికి పరిగణించాల్సిన అంశాలు ఏమిటి? అనే అన్ని సందేహాలకు సమధానాలు మీకోసం.

uses of debt funds
డెట్​ ఫండ్ల ఉపయోగాలు
author img

By

Published : Aug 20, 2020, 1:06 PM IST

సాధారణంగా పెట్టుబడుల్లో తక్కువ రిస్కు ఉండే సాధానాల్లో మ్యూచువల్ ఫండ్లు ప్రధానమైనవి. అందులో ఇంకా ముఖ్యమైనవి డెట్​ ఫండ్లు. డెట్​ ఫండ్లు నిర్ణీత సమయంలో స్థిరమైన రిటర్నులు ఇవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. ఈక్విటీల్లా.. డెట్​ ఫండ్లు ఎక్కువగా హెచ్చుతగ్గులను ఎదుర్కోవు.

అయితే ఇందులో చాలా ఫండ్లు అందుబాటులో ఉండటం వల్ల వీటిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఎక్కువ అయోమయానికి గురవుతారు. ఇందుకోసం మీ అవసరాలు, ఇతర ఆంశాలను పరిశీలించి ఏ ఫండ్ మీకు సరిపోతుందో ఎంపిక చేసుకోవాలి. మరి ఆ అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిస్కు తక్కువ.. నిర్ణీత ఆదాయం

డెట్​ ఫండ్లలో పెట్టే పెట్టుబడుల్లో.. అధిక భాగం స్థిరమైన ఆదాయనిచ్చే సాధనాల్లోకి వెళ్తాయి. ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ బాండ్లు, బ్యాంకులు జారీ చేసిన బాండ్లు, ట్రెజరీ బిల్లులు, సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిపాజిట్లు వంటివి ఈ జాబితాలోకి వస్తాయి. తక్కువ ఆదాయం వచ్చినా.. రిస్కు పెద్దగా ఉండకూడదు అనుకునే వారికి డెట్​ ఫండ్లు సరిగ్గా సరిపోతాయి.

సులభంగా లిక్విడిటీ

డెట్‌ ఫండ్లకు ముందే నిర్ణయించిన మెచ్యురిటీ డేట్‌ ఉంటుంది. వీటి లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు వెంటనే నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. బ్యాంకుల్లో పొదుపు ఖాతా ద్వారా వచ్చే వడ్డీ కంటే.. డెట్​ ఫండ్లు ఎక్కువ ఆదాయాన్ని అందిస్తాయి. మరీ ముఖ్యంగా డెట్‌ ఫండ్లపై వచ్చే ఆదాయానికి టీడీఎస్‌ వర్తించదు. విక్రయించేటప్పుడు మాత్రమే పన్నులను చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర మ్యూచువల్‌ ఫండ్లతో పోలిస్తే.. వీటికి లావాదేవీల ఛార్జీలు తక్కువగా ఉంటాయి.

వడ్డీ రేట్లు

వడ్డీ రేట్లకు, డెట్‌ ఫండ్లకు మంచి సంబంధం ఉంది. వడ్డీ రేట్లు తగ్గుతున్నట్లయితే పాత బాండ్ల విలువ, కొత్తగా విడుదల చేసే బాండ్ల విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. వడ్డీ రేట్లు పెరుగుతున్నట్లయితే.. అప్పటికే విడుదలైన బాండ్ల విలువ, కొత్తగా విడుదలవుతున్న బాండ్ల కంటే తక్కువగా ఉంటుంది.

వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు అప్పటికే విడుదలైన బాండ్ల విలువ ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి వాటికి సంబంధించిన డెట్‌ ఫండ్లు మంచి ప్రదర్శన కనబరుస్తాయి.

అందుకే.. డెట్‌ ఫండ్ల ఎంచుకునేటప్పుడు వడ్డీ రేట్ల సరళిని పరిగణనలోకి తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

క్రెడిట్‌ రిస్కు

తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా డెట్‌ ఫండ్లకు క్రెడిట్‌ ఏజెన్సీలు రేటింగ్ ఇస్తాయి. ఏఏఏ రేటింగ్‌ ఉన్న డెట్‌ ఫండ్లకు తక్కువ క్రెడిట్‌ రిస్కు ఉంటుంది. సీ రేటింగ్‌ ఉన్న వాటికి అత్యంత ఎక్కువ క్రెడిట్‌ రిస్కు ఉంటుంది. డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిగణించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మెచ్యూరిటీ, గడువు

డెట్‌ ఫండ్లకు సంబంధించినంత వరకు వడ్డీ రేట్లు చాలా ముఖ్యమైనవి. కాబట్టి మెచ్యూరిటీ తేదీలో మార్పు అనేది డెట్‌ ఫండ్‌ రిటర్న్‌లను ప్రభావితం చేస్తుంది. మెచ్యూరిటీ గడువుతో పాటు వడ్డీ రేట్లు కూడా నెట్‌ అసెట్‌ విలువ(ఎన్‌ఏవీ)లో మార్పులు తీసుకొస్తాయి.

మెచ్యూరిటీ తేదీ మార్పు

ఫండ్లకు ఎక్కువ గడువు ఉన్నట్లయితే వడ్డీ రేట్లు ఎన్‌ఏవీపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి. మెచ్యూరిటీ తేదీ మార్పు వల్ల ఎక్కువ గడువు ఉన్నట్లయితే వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో మంచి ప్రదర్శన కనబరుస్తాయి. అదే తక్కువ మెచ్యూరిటీ గడువు ఉన్నవి, వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు మంచి ప్రదర్శన కనబరుస్తాయి. మెచ్యూరిటీ గడువు తక్కువున్న వాటితో పోల్చితే.. గడువు ఎక్కువ ఉన్న వాటి విలువలో వడ్డీ రేట్ల వల్ల ఎక్కువ హెచ్చుతగ్గులు ఉంటాయి.

మెచ్యూరిటీలో మార్పుతో వచ్చే రిటర్నులు.. డెట్‌ ఫండ్‌ను మెచ్యూరిటీ తేదీ వరకు ఉంచి తీసుకున్నట్లయితే.. ఎంత శాతం రిటర్న్​లు వస్తాయన్నది కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.

ఇతర అంశాలు

ఛార్జీలు(ఎక్స్‌పెన్స్‌ రేషియో), సరాసరి మెచ్యూరిటీ, క్రెడిట్‌ క్వాలిటీ, అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌(ఏయూఎం) లాంటి ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఒక పథకంలో అందరు మదుపరులు పెట్టుబడి పెట్టిన మొత్తమే ఫండ్‌ ఏయూఎం.

ఇదీ చూడండి:రూ.8.4లక్షల కోట్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.