ETV Bharat / business

జీఎస్​టీ రిటర్నులకు మరో రెండు నెలలు గడువు - జీఎస్​టీ వార్షిక రిటర్ను చివరి తేది

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్​టీ వార్షిక రిటర్నుల దాఖలుకు కేంద్రం మరో రెండు నెలలు గడువు పెంచింది. డిసెంబర్​ 31 వరకు జీఎస్​టీఆర్​-9, జీఎస్​టీఆర్​-9(సీ) రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు శనివారం ప్రకటించింది.

Deadline Extended to gst annual filing date
జీఎస్​టీ వార్షిక రిటర్నుకు గడువు పెంపు
author img

By

Published : Oct 24, 2020, 5:12 PM IST

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్​టీ వార్షిక రిటర్నుల దాఖలుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. జీఎస్​టీఆర్​-9, జీఎస్​టీఆర్​-9(సీ) రిటర్నుల దాఖలుకు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉన్న ప్రస్తుత గడువును మరో రెండు నెలలు పెంచి.. డిసెంబర్ 31 వరకు అవకాశం ఇస్తున్నట్లు శనివారం ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో మే నెలలో.. 2018-19 జీఎస్​టీ రిటర్నులు దాఖలు చేసేందుకు కేంద్రం మూడు నెలలు (సెప్టెంబర్ 30 వరకు) గడువు పొడిగించడం గమనార్హం. అయితే గత నెల ఈ గడువును అక్టోబర్​ 31గా నిర్ణయించింది.

తాజా గడువు ముగింపు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. మరోసారి గడువు పెంపు అవసరమని వ్యాపార వర్గాల నుంచి భారీగా వినతులు రావడం వల్ల.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు (సీబీఐసీ) తెలిపింది. లాక్​డౌన్, కరోనా నిబంధనల వల్ల దేశవ్యాప్తంగా ఇంకా పలు ప్రాంతాల్లో సాధారణ వ్యాపార పరిస్థితులు నెలకొనలేదనే కారణాలతో ప్రధానంగా వినతులు అందినట్లు వివరించింది.

ఇదీ చూడండి:ఐటీ రిటర్నుల​ దాఖలుకు గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.