ETV Bharat / business

కరోనాకు బీమా తీసుకోవాలా? ఇవి తెలుసుకోండి.. - కొవిడ్19కి వర్తించే ఉత్తమ బీమాలు

కరోనా నేపథ్యంలో చాలా మంది ఆరోగ్య బీమా తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ప్రస్తుత అవసరాలకు ఎలాంటి బీమా ఎంచుకోవాలి? అనే విషయంలో సందేహాలు ఉన్నాయి. అలాంటి వాటికి సమాధానాలతో కూడిన ప్రత్యేక కథనం మీ కోసం.

corona insurance
కరోనా కోసం బీమా
author img

By

Published : Jun 29, 2020, 12:45 PM IST

కరోనా కారణంగా భారతీయులు ఆరోగ్య బీమా గురించి మరింతగా తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యానికి డబ్బు అవసరమైతే ఎవరూ సాయం చేసేందుకు ముందుకురారని గ్రహించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లోనూ మీకు బీమా లేకపోతే... ఆస్పత్రులకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించక తప్పకపోవచ్చు.

సాధారణ వైద్యం కోసం.. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో చేరితే బిల్లులు ఎంతలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇక కరోనా చికిత్సకు అయితే రూ.8 నుంచి రూ.9 లక్షల వరకు బిల్లు సాధారణమైపోయింది.

దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈ ఖర్చులు భరిస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లోనూ చికిత్స అందిస్తున్నాయి. అయితే మంచి వైద్యం కావాలంటే మాత్రం జేబుకు చిల్లుపడటం ఖాయం.

విభిన్న వ్యక్తులకు వేర్వేరు పాలసీలు..

సంప్రదాయ ఆరోగ్య బీమా పాలసీ ఉంటే సంబంధిత వ్యక్తి ఆస్పత్రిలో చేరగానే ఆ బీమా సంస్థలే వైద్య ఖర్చులు భరిస్తాయి. కరోనా వైరస్​ సహా వేర్వేరు రకాల వ్యాధుల ఖర్చులను.. నేరుగా ఆస్పత్రులకే చెల్లిస్తాయి బీమా కంపెనీలు. బీమా హామీ ఎంత ఎక్కువగా ఉంటే అంత నష్ట భారం ఆ వ్యక్తికి తప్పుతుంది. కొన్నిసార్లు అదనపు ఛార్జీలు లేకుండానే ఇంటి దగ్గర చేయించుకునే వైద్యం ఖర్చులూ భరిస్తుంటాయి బీమా సంస్థలు.

కొన్ని సంస్థలు నిర్ధిష్టమైన ప్రయోజనాలు కల్పించే పాలసీలను కూడా అందుబాటులోకి తెచ్చాయి. పాలసీదారుడు కొవిడ్-19 వంటి మహమ్మారితో చికిత్స పొందుతుంటే ముందస్తు చెల్లింపులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి వాటిని క్లెయిమ్ చేసుకునేందుకు ఆస్పత్రి బిల్లులు కూడా అవసరం లేదు.

కరోనా వ్యాధికి వర్తించేలా స్వల్పకాలిక ఆరోగ్య బీమా అందించేందుకు బీమా నియంత్రణ ప్రాధికార సంస్థ (ఐఆర్​డీఏఐ) ఆయా బీమా సంస్థలకు అనుమతినిచ్చింది. ఇందులో సాధారణ, నిర్ధిష్ట ప్రయోజనాలు అందించే స్వల్పకాలిక పాలసీలూ ఉన్నాయి.

ప్రయోజనాలు, లోపాలు..

రీయింబర్స్​మెంటు పాలసీలు (సాధారణ ఆరోగ్య బీమా) వ్యక్తిగతంగా గానీ కుటుంబానికి గానీ ఉండొచ్చు. ఇప్పటికే ఉన్న పాలసీలు కరోనాకూ వర్తిస్తాయి. అయితే చాలా మంది (ఎవరికైతే బీమా పాలసీ లేదో) వారు కరోనాకు వర్తించే విధంగా మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.

ఇలాంటి పాలసీల్లో కొన్ని పరిమితులు ఉంటున్నాయి. ముఖ్యంగా చికిత్స కాకుండా కేవలం క్వారంటైన్​లో ఉంచితే బీమా వర్తించదు. ఆ సమయంలో బీమాదారుడికయ్యే ఖర్చును బీమా సంస్థలు భరించవు. ముఖ్యంగా పీపీఈ కిట్​లకు, ఇతర అవసరాలకు ఆస్పత్రులు బిల్లులు వేస్తుంటాయి. వాటి ఖర్చులు వినియోగదారుడే చెల్లించాల్సి ఉంటుంది.

కొన్ని పాలసీల్లో పీపీఈలను బీమా పరిధిలోకి తీసుకోవు. కరోనా సోకిన వ్యక్తి వైద్యానికి కూడా 25 శాతం బిల్లును పాలసీదారుడే చెల్లించుకోవాల్సి రావచ్చు. కొన్ని ఆస్పత్రుత్లో వైద్యానికి అయ్యే బిల్లులోనే పీపీఈల బిల్లులను కలుపుతున్నారు. దీని ద్వారా కొంత భారం తగ్గుతుంది.

ఇక్కడ ఊరట కలిగించే విషయం ఒకటి ఉంది. కరోనాకు ఇచ్చే బీమాలో పీపీఈలు, చేతి తొడుగులు, మాస్క్​ సహా ఇతర అన్ని రకాల అవసరాలకు వర్తించేలా పాలసీలు ఉండాలని సూచించింది ఐఆర్​డీఏఐ. కొన్ని రకాల ప్లాన్​లతో... కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా.. ఇంటి వద్దనే వైద్యం చేయించుకున్నా బీమా వర్తిస్తుంది.

నిర్ధిష్ట పాలసీల్లో ముఖ్యంగా ముందస్తుగానే చెల్లింపులు చేయడం వల్ల.. పాలసీదారుకు ఆదాయం లేకపోయినా (చికిత్సలో ఉన్నప్పుడు జీతాలు లేకపోవడం వంటి సందర్భాల్లో) ఇంటి ఖర్చులకు ఆ మొత్తం నుంచి వాడుకునే సదుపాయం ఉంది. ఈ వెసులుబాటు కోసం ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు.

సరైన ఎంపిక

కరోనా నేపథ్యంలో వైద్యం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం సాధారణ, ఫిక్సెడ్​ ప్లాన్​ పాలసీలు తీసుకోవడం ఉత్తమం.

అన్ని రకాల వైద్య ఖర్చులు భరించే విధంగా గరిష్ఠ బీమా తీసుకోవడం మంచిది.

4-5 మంది ఉన్న కుటుంబానికి ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్​ సరిగ్గా సరిపోతుంది. దీనికి ప్రీమియం కూడా సాధారణంగా సర్దుబాటు చేసుకోదగ్గ మొత్తమే ఉంటుంది.

రూ.1-3 లక్షల బీమా కలిగి ఉన్నవారు.. టాప్​-అప్​ ప్లాన్​ తీసుకోవడం మంచిది.

(రచయిత:కుమార్​ శంకర్​ రాయ్​, ఫినాన్షియల్ జర్నలిస్ట్, పర్సనల్​ ఫినాన్స్ నిపుణులు)

  • గమనిక: ఈ కథనంలోని అంశాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతం. వీటితో ఈటీవీ భారత్​కు, సంస్థ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ కథనం ద్వారా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని భావిస్తే.. వ్యక్తిగతంగా ఎవరైనా నిపుణుడిని సంప్రదించమని ఈటీవీ భారత్​ సలహా.

పర్సనల్​ ఫినాన్స్​కు సంబంధించి మీకు సందేహాలు ఉంటే businessdesk@etvbharat.com ను సంప్రదించవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.