వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చిన మొదటి రెండు సంవత్సరాల్లో.. రాష్ట్రాలకు నష్టపరిహారంగా చెల్లించాల్సిన రూ.47,272 కోట్ల సెస్‌ను కేంద్రం తప్పుగా తమ వద్ద పెట్టుకున్నట్లు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెల్లడించింది.
ప్రభుత్వ ఖాతాను ఆడిట్ చేసిన కాగ్.. జీఎస్టీ అమలులోకి వచ్చిన 2017 నుంచి రెండేళ్లపాటు ఆ మొత్తాన్ని లాప్స్ అవ్వని నిధికి బదిలీ చేయకుండా.. కేంద్రం జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు పేర్కొంది.
2017-18లో రూ.62,612 కోట్ల సెస్ వసూలవ్వగా.. అందులో రూ.56,146 కోట్లు, 2018-19లో వసూలైన రూ.95,081 కోట్ల సెస్‌లో.. రూ.54,275 కోట్లను నాన్-లాప్సబుల్ నిధికి కేంద్రం బదిలీ చేసినట్లు పేర్కొంది కాగ్.
ఇలా రెండేళ్లలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని తప్పుగా తమ వద్దే పెట్టుకుని.. కేంద్రం ఇతర అవసరాలకు వినియోగించినట్లు కాగ్ వివరించింది.
ఇవీ చూడండి: