కరోనా నేపథ్యంలో నిధుల లేమితో సతమతమవుతున్న రాష్ట్రాలకు కేంద్రం సాంత్వన చేకూర్చింది. రెవెన్యూ లోటు ఉన్న 14 రాష్ట్రాలకు రెండో విడతగా రూ.6,195.08 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కరోనా నియంత్రణకు నిధులు విడుదల చేసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
రెవెన్యూ లోటు ఉన్న 14 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఈ మేరకు ఏపీకి రూ.491 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థికశాఖ పేర్కొంది.