ETV Bharat / business

ఎంఎస్​ఎంఈలకు అండగా రూ.1.63 లక్షల కోట్ల రుణాలు - లాక్​డౌన్​లో దెబ్బతిన్న ఎంఎస్​ఈలకు మంజూరైన రుణాలు

లాక్​డౌన్​తో దెబ్బతిన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్​ఎంఈ)ను ఆదుకునేందుకు.. అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద బ్యాంకులు రూ.1.63 లక్షల కోట్లు మంజూరు చేశాయి. మొత్తం 42 లక్షల ఎంఎస్ఎంఈలకు.. సెప్టెంబర్ 10 నాటికి ఈ మొత్తాన్ని మంజూరు చేసినట్లు తెలిపింది కేంద్ర ఆర్థిక శాఖ.

Banks sanction Rs 1.63 lakh loans to MSMEs
క్రెడిట్ గ్యారంటీ పథకం ద్వారా ఎంఎస్ఎఈలకు భారీ రుణాలు
author img

By

Published : Sep 13, 2020, 4:57 PM IST

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్​ఎంఈ).. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా సెప్టెంబర్‌ 10 నాటికి రూ.1.63 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఎంఎస్​ఎంఈలను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక రుణ లభ్యత పథకం కింద వీటిని మంజూరు చేసినట్లు పేర్కొంది. మొత్తం 42 లక్షలకుపైగా వ్యాపారాలకు ఈ రుణాలు ఇచ్చినట్లు తెలిపింది.

ఇందులో ఇప్పటికే 25 లక్షల ఎంఎస్​ఎంఈలకు.. రూ.1.18 లక్షల కోట్లు అందించినట్లు ఆర్థిక శాఖ వివరించింది.

ఆత్మ నిర్భర్​ భారత్​లో భాగంగా..

లాక్​డౌన్​ నేపథ్యంలో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు 'ఆత్మ నిర్భర్​ భారత్​' పేరుతో కేంద్రం రూ.20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అత్యవసర రుణ గ్యారెంటీ పథకం కింద రూ.3 లక్షల కోట్లు కేటాయించారు.

ఇదీ చూడండి:బంగారం ధరలు తగ్గితే రుణాలపై ప్రభావమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.