ETV Bharat / business

'డీప్​ఫేక్'​ వీడియోలకు చెక్​ పెట్టే దిశగా ఫేస్​బుక్​

సామాజిక మాధ్యమాల్లో ఫేక్​ వీడియోలు(కల్పితం, నకిలీ) ఇటీవలి కాలంలో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. కృత్రిమ మేధ(ఏఐ), అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కల్పిత వీడియోలను వాస్తవాలుగా సృష్టిస్తున్నారు. ఫేస్​బుక్​లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే... ఒక పకడ్బందీ విధానాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజ సంస్థ.

'డీప్​ఫేక్'​ వీడియోలకు చెక్​ పెట్టే దిశగా ఫేస్​బుక్​..!
author img

By

Published : Jun 27, 2019, 3:30 PM IST

ఫేక్​ వీడియోలు చూస్తే విసుగొస్తుందా..? సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో అలాంటివే కనిపిస్తున్నాయా..? వాస్తవాలుగా నమ్మించి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయా..? వాటికి చెక్​ పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తోంది ఫేస్​బుక్​.

తప్పుడు వీడియోల బాధితుల్లో ఫేస్​బుక్​ మొదటి వరుసలో ఉంటుంది. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​), కొత్తగా పుట్టుకొస్తున్న అధునాతన సాంకేతికత తప్పుడు వీడియోలను సృష్టించేందుకు తోడ్పడుతోంది. ఇది ఫేస్​బుక్​లోనే అధికం. అవి మార్ఫింగ్​ చేసి సృష్టించినవే అయినా... ఎలాంటి సందేహాలు రాకుండా వాస్తవాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదే అంశంపై స్పందించారు ఫేస్​బుక్​ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​. కొలొరాడోలో జరిగిన 'ఆస్పెన్​ ఐడియాస్​ ఫెస్టివల్​'లో పాల్గొన్న ఆయన ఫేక్ ​వీడియోల గురించి మాట్లాడారు.

డీప్​ఫేక్​ వీడియోలపై మాట్లాడిన మార్క్​ జుకర్​బర్గ్​

''ఇలాంటి డీప్​ఫేక్​ వీడియోలను.. తప్పుడు, నకిలీ వార్తలకు భిన్నంగా చూడాలి. అధునాతన సాంకేతికత మరింత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ సమయంలో ఫేక్​ వీడియోలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. వీటి కోసం వివిధ రంగాల నిపుణులతో మాట్లాడుతున్నాం.''

- మార్క్​ జుకర్​బర్గ్​, ఫేస్​బుక్​ సీఈఓ

ఇలాంటి వాటన్నింటినీ తప్పుడు వార్తలు, తప్పుదోవ పట్టించే అంశాల కిందనే చూడాలని కంపెనీ కార్యనిర్వాహకులు గతంలో వేర్వేరు సందర్భాల్లో పేర్కొన్నారు. అయితే... జుకర్​బర్గ్​ డీప్​ ఫేక్​​వీడియోలను వేరేలా చూసి... తీవ్రంగా పరిగణించాలన్నారు. వీటిని పూర్తిగా నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సంకేతాలిచ్చారు.

బయటివారికే...

ఇప్పటివరకు.. ఇతర సామాజిక మాధ్యమ సంస్థల తరహాలో డీప్​ఫేక్​ వీడియోలు, వార్తలను పసిగట్టి, అరికట్టేలా ఫేస్​బుక్​కు ప్రత్యేక విధానమేమీ లేదు. ఆ బాధ్యతలను బయటివ్యక్తులకే అప్పగించేది. అయితే.. ఈ వ్యవస్థ మెరుగైన ఫలితాల్ని ఇవ్వలేదు.

ఫేక్​వీడియోల వల్ల ఎందరో ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలున్నాయి. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట రోజూ ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

ఇదీ చూడండి: పోలీసుల కారుపై పుష్​ అప్స్​.. వీడియో వైరల్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Angels Stadium, Los Angeles, California, USA. 26th June 2019.
Los Angeles Angels 5, Cincinnati Reds 1
1. 00:00 Angels Shohei Ohtani taking practice pitches on the mound for the first time since his Tommy John surgery on Oct 1
Bottom of 1st Inning
2. 00:18 Ohtani hits single
3. 00:44 Replay of hit
Bottom of 4th Inning
4. 00:58 Ohtani hits double (quick transition from replay of pitching)
5. 01:22 Replay of hit
Bottom of 6th Inning
6. 01:35 Ohtani draws walk
7. 01:55 Ohtani steals 2nd base
8. 02:09 Replay of steal
Bottom of 8th Inning
9. 02:18 Ohtani hits single and loses helmet
10. 02:37 Replay of hit
11. 02:52 Angels Justin Bour hits 3-run home run to bring in Ohtani, 5-1 Angels
SOURCE: MLB
DURATION: 03:24
STORYLINE:
Shohei Ohtani threw off a mound Wednesday for the first time since undergoing Tommy John surgery, taking another significant step in his return to pitching for the Los Angeles Angels next season.
About four hours after Ohtani threw 40 pitches off a mound and made 70 additional throws on flat ground at Angel Stadium, he was in Los Angeles' lineup as the designated hitter against Cincinnati.
The Japanese star went 3-for-3 with a walk and a run scored in the Angels 5-1 win over the Cincinnati Reds.
Ohtani will not pitch for the Angels until 2020, manager Brad Ausmus confirmed once again.
Ohtani said he tried to throw off the mound at about 50 percent of his full strength, in accordance with his rehab plan. Most of his throws from the mound were with the catcher standing up, but he still went through his pitching motion fairly effectively.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.