ETV Bharat / business

యూట్యూబ్​, అమెజాన్​కు జొమాటో సూపర్​ పంచ్​ - గానా

ఒకే వ్యాపారంలో పోటీ పడే సంస్థలు సామాజిక మాధ్యమాల్లో పరస్పరం కౌంటర్లు వేసుకోవడం ఇటీవల సాధారణమైంది. జొమాటో కూడా అలాంటి పనే చేసింది. అయితే... ఫుడ్​ డెలివరీ రంగంలో ఉన్న మరో సంస్థను ఉద్దేశించి కాదు. ఏమాత్రం సంబంధంలేని రంగాల్లో ఉన్న దిగ్గజాలను లక్ష్యంగా చేసుకుని. ఎందుకలా?

'జొమాటో'
author img

By

Published : Jul 10, 2019, 2:10 PM IST

"అప్పుడప్పుడు ఇంటి భోజనం కూడా తినండి" అనే తమ ట్వీట్​ను కాపీ చేసిన దిగ్గజ సంస్థలకు ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ జొమాటో గట్టి కౌంటర్​ ఇచ్చింది. 'అప్పుడప్పుడు సొంతంగా ట్వీట్​లు ఆలోచించండి' అంటూ ఆయా సంస్థలను ట్యాగ్ చేస్తూ మరో ట్వీట్​ చేసింది జొమాటో.

ఇలా మొదలు..

జొమాటో... ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ. వ్యాపారం పెంచుకునేందుకు నిరంతరం విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. మీ దగ్గర్లోని రెస్టారెంట్లలో అద్భుత వంటకాలు ఉన్నాయంటూ, సూపర్​ ఆఫర్లు ఇస్తున్నామంటూ ఆహార ప్రియుల్ని ఊరిస్తూ ఉంటుంది.

కాస్త భిన్నంగా...

"అప్పుడప్పుడు ఇంటి భోజనం కూడా చేయండి" అంటూ జొమాటో ఇటీవల ఓ సరదా ట్వీట్ చేసింది. హోటల్​ ఫుడ్​తోపాటు త్వరలో ఇంటి భోజనం హోమ్ డెలివరీ సేవలనూ అందుబాటులోకి తెస్తుందన్న ఊహాగానాలకు తావిచ్చింది.

సామాన్యుల నుంచి వచ్చిన భారీ స్పందనతో ఈ ట్వీట్ కాస్త వైరల్​గా మారింది. యూట్యూబ్​, అమెజాన్​ ప్రైమ్​, మొబిక్విక్​ వంటి వేర్వేరు రంగాల వ్యాపార దిగ్గజాలు ఇదే ట్రెండ్​ ఫాలో అయ్యాయి. తాము అందించే సేవలకు పూర్తిగా భిన్నమైన సలహాలను యూజర్లకు ఇస్తూ ట్వీట్లు చేశాయి.

రాత్రి మూడు గంటల తర్వాత ఫోన్ పక్కన పెట్టి పడుకోండి అంటూ యూట్యూబ్ ఇండియా ట్వీట్ చేసింది.

youtube
యూట్యూబ్ ఇండియా

అప్పుడప్పుడు లైన్​లో నిల్చుని కరెంట్​ బిల్​ చెల్లించండి అంటూ మొబిక్విక్ సరదా ట్వీట్ చేసింది.

mobikwik
మొబిక్విక్

ప్రముఖ యూట్యూబ్​ ఛానల్​ 'ద వైరల్ ఫీవర్'... ఇంట్లో టీవీ చూడమని యూజర్లకు సూచించింది.

కేబుల్​ టీవీలో వచ్చే కార్యక్రమాలు కూడా చూడండి అంటూ అమెజాన్ ప్రైమ్​ వీడియో ఇండియా ట్వీట్ చేసింది.

amazon prime
అమెజాన్ ప్రైమ్​ వీడియో ఇండియా

అప్పుడప్పుడు బోరింగ్​ని కూడా ఆస్వాదించండి అంటూ మ్యూజిక్ యాప్ గానా ట్వీట్​ చేసింది.

gana
గానా

అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఉండండి అంటూ ఆన్​లైన్ ట్రావెల్​ సేవల సంస్థ ఇక్సిగో సూచించింది.

బుక్​మై షో, ఫాసోస్, డాబర్ హాజ్​మోలా సంస్థలు ఇదే తరహా ట్వీట్లు చేశాయి.

ఆఖరి పంచ్​...

ZOMATO
జొమాటో ట్వీట్​

ఇలా తమ ట్వీట్​ను కాపీ కొట్టిన సంస్థలన్నింటినీ ప్రస్తావిస్తూ అదిరే పంచ్​ వేసింది జొమాటో. "సొంతంగా ట్వీట్​లు ఆలోచించండి" అంటూ మరో ట్వీట్​ చేసింది.

ఇదీ చూడండి: టీసీఎస్ తొలి త్రైమాసిక నికర లాభం రూ.8,131కోట్లు

AP Video Delivery Log - 2300 GMT News
Tuesday, 9 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2152: UK Conservatives Mandatory on-screen credit: 'Britain's Next Prime Minister: The ITV Debate'/No re-broadcast or re-publication after 2000 GMT Monday 22nd July 2019/Clips published before this time may remain online/No archive or resale rights 4219728
Johnson and Hunt face off in UK leadership debate
AP-APTN-2115: US SC Woman Carjacking Video AP Clients Only 4219726
Woman throws snake at driver in carjacking
AP-APTN-2101: Argentina De La Rua AP Clients Only 4219725
Mourners pay respects to Ex-Argentine leader
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.