ETV Bharat / business

గంటల్లోనే జొమాటో ఐపీఓ 36% సబ్​స్క్రైబ్​! - జొమాటో ఐపీఓ ప్రైస్​ బ్యాండ్​

జొమాటో ఐపీఓ దూసుకుపోతోంది. కేవలం గంటల వ్యవధిలో 36 శాతం సబ్​స్ట్రిప్షన్లు పూర్తయినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద లభించిన డేటా ద్వారా తెలిసింది. బుధవారమే (జులై 14) జొమాటో ఐపోఓకు వచ్చింది. జులై 16న ఐపీఓ ముగియనుంది.

Huge response to Zomato IPO
జొమాటో ఐపీఓకు భారీ స్పందన
author img

By

Published : Jul 14, 2021, 3:18 PM IST

ప్రముఖ ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్​ఫామ్ 'జొమాటో' ఇనీషియల్ పబ్లిక్​ ఆఫర్ (ఐపీఓ)కు భారీ స్పందన వస్తోంది. ఐపీఓ బుధవారం ప్రారంభమవగా.. కొన్ని గంటల్లోనే 36 శాతం సబ్​స్క్రిప్షన్​లను సాధించింది. మొత్తం 71.92 కోట్ల షేర్లు ఇష్యూకు ఉంచగా.. 26.10 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలైనట్లు స్టాక్​ మార్కెట్ల వద్ద లభ్యమైన డేటాలో వెల్లడైంది.

వ్యక్తిగత రిటైల్​ ఇన్వెస్టర్లకు మొత్తం 12.95 కోట్ల షేర్లు రిజర్వు చేయగా.. 1.91 రెట్ల బిడ్లు అధికంగా దాఖలైనట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం 1:30 వరకు 24.76 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చినట్లు డేటా పేర్కొంది. నాన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లకోసం రిజర్వు చేసిన వాటా కన్నా 7 శాతం అధికంగా బిడ్లు వచ్చినట్లు వెల్లడైంది.

యాంకర్ ఇన్వెస్టర్ల నుంచీ భారీగా బిడ్లు..

ఐపీఓకు ముందు రోజు (జూన్​ 13) నాటికి యాంకర్​ ఇన్వెస్టర్ల నుంచి 35 రెట్లు ఎక్కువ బిడ్లు పొందింది జొమాటో. ఒక్కో షేరుకు రూ.72-76గా ధర నిర్ణయించారు. ప్రారంభ వాటా అమ్మ‌కం కంటే ముందు 186 యాంక‌ర్ పెట్టుబ‌డిదారుల నుంచి రూ.4,196 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన‌ట్లు జొమాటో తెలిపింది. లావాదేవీల ప‌రిమాణాన్ని రూ.4,196.51 కోట్ల‌కు క‌లిపి యాంక‌ర్ ఇన్వెస్ట‌ర్ల‌కు 55,21,73,505 ఈక్విటీ షేర్ల‌ను కేటాయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు బీఎస్ఈ స‌ర్క్యుల‌ర్‌లో తెలిపింది.

ప్రధాన యాంకర్ ఇన్వెస్టర్లు

బ్లాక్‌రాక్‌, టైగ‌ర్ గ్లోబ‌ల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫండ్‌, ఫిడిలిటీ, న్యూ వ‌ర‌ల్డ్ ఫండ్ ఇంక్‌, జేపీ మోర్గాన్‌, మోర్గాన్ స్టాన్లీ ఆసియా (సింగ‌పూర్‌) పిటి-ఓడీఐ, గోల్డ్‌మ‌న్ సాచ్స్ (సింగ‌పూర్‌) పిటి-ఓడీఐ, టిరో, కెన‌డా పెన్ష‌న్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు, సింగ‌పూర్ ప్ర‌భుత్వం, మానిట‌రీ అథారిటీ ఆఫ్ సింగ‌పూర్, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ జొమాటోలోని యాంక‌ర్ పెట్టుబ‌డిదారుల్లో ఉన్నారు.

యాంక‌ర్ బిడ్డింగ్‌లో పాల్గొన్న దేశీయ పెట్టుబ‌డిదారుల్లో కోట‌క్ మ్యూచువ‌ల్ ఫండ్, ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్‌, యాక్సిస్ మ్యూచువ‌ల్ ఫండ్‌, ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్‌, యుటీఐ మ్యూచువ‌ల్ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్‌, ఐడీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్‌, సుంద‌రం మ్యూచువ‌ల్ ఫండ్‌, ఎడెల్విస్ మ్యూచువ‌ల్ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నాయి. కోట‌క్ మ‌హీంద్రా క్యాపిట‌ల్‌, మోర్గాన్ స్టాన్లీ ఇండియా, క్రెడిట్ సూయ‌జ్‌ గ్రూఫ్ ఏజీ, బోఫా సెక్యూరిటీస్‌, సిటీ గ్రూఫ్ ఇంక్ ఈ ఐపీఓను నిర్వ‌హిస్తున్నాయి.

ఇదీ చదవండి:WPI inflation: తగ్గిన టోకు ద్రవ్యోల్బణం.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.