ETV Bharat / business

రాణా కపూర్‌కు చెందిన రూ.127 కోట్ల ఫ్లాట్‌ సీజ్‌! - లండన్​లోని రాణా కపూర్ ఫ్లాట్ సీజ్

మనీలాండరింగ్ కేసులో.. ఎస్​ బ్యాంక్ కో ప్రమోటర్ రాణా కపూర్​కు చెందిన ఓ ఫ్లాట్​ను ఎన్​ఫోర్స్​మెంట్​ డెరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. లండన్‌లోని 77 సౌత్‌ ఆడ్లీ స్ట్రీట్‌లో ఉన్న ఈ ఫ్లాట్ విలువ దాదాపు రూ.127 కోట్లుగా వెల్లడించింది ఈడీ. ఈ ఫ్లాట్​ను విక్రయించేందుకు రాణా కపూర్ ప్రయత్నించినట్లు తెలియడం వల్ల అటాచ్ చేసినట్లు వివరించింది.

ED attaches Rana Flat
రాణా లగ్జరీ ఫ్లాట్ సీజ్
author img

By

Published : Sep 25, 2020, 10:19 PM IST

ఎస్‌ బ్యాంక్‌ కో ప్రమోటర్‌ రాణా కపూర్‌కు చెందిన రూ.127 కోట్ల విలువైన ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఆ సంస్థ ఈ మేరకు సీజ్‌ చేసింది. లండన్‌లోని 77 సౌత్‌ ఆడ్లీ స్ట్రీట్‌లోని అపార్ట్‌మెంట్‌ 1ను మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద సీజ్‌ చేసినట్లు ఈడీ శుక్రవారం తెలిపింది. దీని విలువ సుమారు రూ.127 కోట్లు ఉంటుందని వెల్లడించింది. దీన్ని రాణా కపూర్‌ 2017లో డూయిట్‌ క్రియేషన్స్‌ జర్సీ లిమిటెడ్‌ పేరిట రూ.93 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఈడీ పేర్కొంది.

ఫ్లాట్ విక్రయానికి రాణా ప్రయత్నం..

లండన్‌లోని ఈ ఫ్లాట్‌ను ప్రముఖ కన్సల్టెంట్‌ ద్వారా విక్రయించేందుకు కపూర్‌ ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఈడీ పేర్కొంది. ఆ ఫ్లాట్‌ పలు వెబ్‌సైట్లలో విక్రయానికి ఉన్నట్లు తాము గుర్తించామన్నది. దీనితో యూకే ప్రభుత్వంతో కలిసి సదరు ఫ్లాట్‌ను సీజ్‌ చేసింది. ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు ఈడీ రూ.2,011 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

2018 ఏప్రిల్‌- జూన్‌ మధ్య డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ స్వల్పకాలిక డిబెంచర్లలో ఎస్‌ బ్యాంక్‌ రూ.3,700 కోట్లు పెట్టుబడులు పెట్టిందని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన ఆర్‌కేడబ్ల్యూకు రూ.750 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రతిగా రాణా కపూర్‌ కుమార్తెలకు చెందిన డూయిట్‌ అర్బన్‌ వెంచర్స్‌లో వద్వాన్‌ రూ.600 కోట్లు చొప్పించారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే రాణా కపూర్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన కపిల్‌ వద్వాన్‌, ధీరజ్‌ వద్వాన్‌ ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం జుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ఇదీ చూడండి:టాటా నుంచి వైదొలగనున్న పల్లోంజీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.