బడ్జెట్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ మరో ఉత్పత్తిని తీసుకురాబోతుంది. గతేడాది ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ ఆవిష్కరణతో వ్యక్తిగత ఆరోగ్యం రంగంలో అడుగుపెట్టిన సంస్థ.. తాజాగా ఎలక్ట్రిక్ బ్రష్‌ను తీసుకురానుంది. ఈ మేరకు టీజర్‌ను విడుదల చేసింది షియోమీ.
ఎంఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో 'మీ వ్యక్తిగత దంతవైద్యుడు- ఫిబ్రవరి 20న వస్తున్నాడు' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.
-
How many times do you brush your teeth everyday?#YourPersonalDentist unveiling tomorrow. pic.twitter.com/60tKt7EzFX
— Mi India #108MP IS COMING! (@XiaomiIndia) February 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">How many times do you brush your teeth everyday?#YourPersonalDentist unveiling tomorrow. pic.twitter.com/60tKt7EzFX
— Mi India #108MP IS COMING! (@XiaomiIndia) February 19, 2020How many times do you brush your teeth everyday?#YourPersonalDentist unveiling tomorrow. pic.twitter.com/60tKt7EzFX
— Mi India #108MP IS COMING! (@XiaomiIndia) February 19, 2020
అనేక ప్రత్యేకలు..
ఎంఐ ఎలక్ట్రిక్ బ్రష్‌ను మాగ్నెటిక్ లెవిటేషన్ సోనిక్ మోటార్‌తో తయారుచేసింది షియోమీ. దీనిలో ఉండే అల్ట్రాసోనిక్ సాంకేతికత వల్ల బ్రష్ నిమిషానికి 31,000 సార్లు తిరుగుతుంది. మెటల్ ఫ్రీ హెడ్, అత్యుత్తమ నాణ్యత కలిగిన బ్రిజిల్స్, ఐపీఎక్స్7 వాటర్ రెసిస్టెంట్ ఈ బ్రష్ ప్రత్యేకతలు.
మనకు కావాల్సిన విధంగా..
చాలా సెన్సిటివ్‌గా, పళ్లను లోతుగా శుభ్రపరచడానికి ఇది ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. అయితే ఇందుకు మన ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన మోడ్‌లో పెట్టుకుని స్విచ్ ఆన్ చేస్తే.. అదే శుభ్రం చేస్తుంది. ఈ యాప్ మనం బ్రష్ చేసిన సమయాలు, విధానాన్ని డేటా రూపంలో నిక్షిప్తం చేస్తుంది. పళ్ల ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుంది.
18 రోజుల బ్యాటరీ లైఫ్..
700ఏంఏహెచ్ లిథియం బ్యాటరీ కలిగిన ఈ టూత్ బ్రష్ కు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 18 రోజులు వాడుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. బ్యాటరీ స్థాయి సూచించే ఇండికేటర్ కూడా ఉంటుంది.
చైనాలో 2017లోనే ఎంఐ ఎలక్ట్రిక్ బ్రష్ అమ్మకాలు ప్రారంభించింది. 2018లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు విస్తరించినా.. భారత్‌కు మాత్రం గురువారం రానుంది. దీని ధర సుమారు రూ.2,000 వరకు ఉండవచ్చని నిపుణుల అంచనా.