చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థ షియోమీ... భారత మార్కెట్లోకి మరో రెండు కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను తీసుకొస్తోంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్లతో.. సరికొత్త హంగులు, అత్యాధునిక సాంకేతికతతో రెడ్మీ కే20, కే20 ప్రో పేర్లతో భారత మార్కెట్లోకి జులై 15న వీటిని విడుదల చేయనుంది.
-
Mi fans! Here's a KNOCKOUT announcement! 📢 #RedmiK20 and #RedmiK20Pro are launching in India within 6 months.. ooops, I meant 6 weeks! 🥊🥊
— Manu Kumar Jain (@manukumarjain) June 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
It's time India experiences the true #FlagshipKiller 2.0! 🔥 RT 🔄 if you are excited about these amazing devices.#Xiaomi ❤️ #Redmi pic.twitter.com/QN0JxH1osg
">Mi fans! Here's a KNOCKOUT announcement! 📢 #RedmiK20 and #RedmiK20Pro are launching in India within 6 months.. ooops, I meant 6 weeks! 🥊🥊
— Manu Kumar Jain (@manukumarjain) June 3, 2019
It's time India experiences the true #FlagshipKiller 2.0! 🔥 RT 🔄 if you are excited about these amazing devices.#Xiaomi ❤️ #Redmi pic.twitter.com/QN0JxH1osgMi fans! Here's a KNOCKOUT announcement! 📢 #RedmiK20 and #RedmiK20Pro are launching in India within 6 months.. ooops, I meant 6 weeks! 🥊🥊
— Manu Kumar Jain (@manukumarjain) June 3, 2019
It's time India experiences the true #FlagshipKiller 2.0! 🔥 RT 🔄 if you are excited about these amazing devices.#Xiaomi ❤️ #Redmi pic.twitter.com/QN0JxH1osg
''రెడ్మీ అభిమానులారా..! అద్భుతమైన ప్రకటనతో షియోమీ మీ ముందుకొస్తుంది. రెడ్మీ కే20, కే20 ప్రోలను భారత్‌లో 6 వారాల్లోగా విడుదల చేయనున్నాం.''
- మను కుమార్ జైన్, షియోమీ ఇండియా ఎండీ ట్వీట్
చైనాలో రెడ్మీ కే20, కే 20ప్రోగా ఉన్న ఈ ఫోన్లను.. పోకో ఎఫ్2, పోకో ఎఫ్2ప్రోగా భారత్‌లో షియోమీ విడుదల చేస్తుందని ఊహాగానాలు వెలువడ్డాయి. వాటికి తెరదించుతూ కే20, కే20ప్రో గానే భారత మార్కెట్లోకి తెస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.
చైనాలో ఈ మోడళ్లు గత వారంలోనే విడుదలయ్యాయి.
శక్తిమంతమైన ప్రాసెసర్లు..
రెడ్మీ కే20.. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 730 చిప్సెట్ ప్రాసెసర్‌తో వస్తుండగా... కే 20ప్రో అత్యంత అధునాతన 855 చిప్సెట్తో రూపొందింది.
ప్రధాన ఆకర్షణలివే
ఈ రెండు ఫోన్లలో ఆమోలెడ్ (6.39 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్) తెరలు ఉన్నాయి. పాప్అప్ ఫ్రంట్ కెమెరా సదుపాయం ఉంది.
మూడు వెనుక కెమెరాలు
కే 20, కే20ప్రో.. రెండు మోడళ్లలోనూ మూడు వెనుక కెమెరాలు ఉంటాయి. ప్రోలో 48+13+8 మెగాపిక్సెళ్లతో కెమెరాను పొందుపరిచింది షియోమీ. రెండింటిలోనూ ముందు కెమెరా 20 మెగాపిక్సెళ్లుగా ఉండనుంది. కే20, కే20ప్రోల్లో వెనుక, ముందు కెమెరాలు ఒకే విధంగా ఉన్నా.. విభిన్న సెన్సార్లను వినియోగించింది షియోమీ.
రెడ్మీ కే20
- స్నాప్‌డ్రాగన్ 730 ప్రాసెసర్
- 6 జీబీ రామ్
- 64, 128జీబీ అంతర్గత మెమొరీ సామర్థ్యం
- బ్యాటరీ సామర్థ్యం : 4000ఎంఏహెచ్
- ప్రారంభ ధర: సుమారు రూ. 20 వేలు
రెడ్మీ కే20 ప్రో
- క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్సెట్
- 6/8జీబీ రామ్
- 128/256జీబీ అంతర్గత సామర్థ్యం
- బ్యాటరీ సామర్థ్యం : 4000ఎంఏహెచ్
- ప్రారంభ ధర : దాదాపు రూ.21వేలు