సామాజిక మాధ్యమం ఫేస్బుక్.. భారత్ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. సాంకేతిక సామర్థ్యం పెంపు, మౌలిక సదుపాయాల కల్పనతో చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహమందించే విధంగా ఈ పెట్టుబడులు ఉండనున్నట్లు ఫేస్బుక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ తెలిపారు. ఉద్యోగాల కల్పన కూడా ఈ పెట్టుబడుల ముఖ్య ఉద్దేశమని చెప్పుకొచ్చారు.
డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్ మిగత అన్ని దేశాలకన్నా ముందు వరుసలో ఉందని అజిత్ మోహన్ వెల్లడించారు. భవిష్యత్‌లో భారత రూపురేఖలను మార్చడంలో ఇది మేలు చేసే అంశమన్నారు.
సాంకేతికతను అందిపుచ్చుకోవడం వల్ల పారిశ్రామికంగా ఎన్నో మార్పులు వస్తాయని, ఇది భారత సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల కొత్త ఆవిష్కరణలు, వ్యాపారాలకు అవకాశాలు పెరిగి ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందనన్నారు. ఫలితంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: షేర్‌చాట్ సూపర్ హిట్- గంటకు 5 లక్షల డౌన్లోడ్స్