టెలికాం శాఖకు ఏజీఆర్ రూపంలో బకాయిపడ్డ సొమ్ములో మరో వెయ్యి కోట్ల రూపాయలు చెల్లించింది వొడాఫోన్-ఐడియా. టెలికాం శాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే రూ.2,500 కోట్లు జమ చేసిన వొడాఫోన్.. నేడు రూ.1,000 కోట్లు కట్టింది.
కోర్టు తిరస్కరించినా..
అయితే బకాయిలను పాక్షికంగా చెల్లిస్తామని వొడాఫోన్ అభ్యర్థించగా సోమవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయినప్పటికీ వొడాఫోన్ రూ.2,500 కోట్లే చెల్లించింది. టెలికాం శాఖకు ఏజీఆర్ బకాయిల రూపంలో రూ.53 వేల కోట్లు వొడాఫోన్ చెల్లించాల్సి ఉంది.
ఏజీఆర్ బకాయిలను ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చర్యలు తీసుకుంటామని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఏజీఆర్ బకాయిలకు సంబంధించి రూ.10వేల కోట్లను ఎయిర్టెల్ చెల్లించింది.