ETV Bharat / business

'మరో రూ.వెయ్యి కోట్ల ఏజీఆర్​ బకాయి చెల్లించాం' - వొడాఐడియా ఏజీఆర్ బకాయిలు

ఏజీఆర్​ బకాయి కింద మరో రూ.వెయ్యి కోట్లు టెలికాం విభాగానికి చెల్లించింది వొడాఫోన్ ఐడియా. త్వరలో సుప్రీం కోర్టులో ఏజీఆర్ వివాదంపై విచారణ జరగనున్న నేపథ్యంలో.. గత ఆదేశాలకు అనుగుణంగా ఈ చెల్లింపు జరిపింది టెలికాం సంస్థ.

agr payment of Voda Idea
వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిలు
author img

By

Published : Jul 18, 2020, 6:24 PM IST

ప్రముఖ సంస్థ వొడాఫోన్‌-ఐడియా ఏజీఆర్‌ బకాయిల కింద శనివారం మరో రూ.1,000 కోట్లు టెలికాం విభాగానికి చెల్లించింది. తాజా చెల్లింపులతో కలిపి ఇప్పటివరకు టెలికాం విభాగానికి వొడాఫోన్‌-ఐడియా మొత్తం రూ. 7,854 కోట్లు చెల్లించింది.

జులై మూడో వారంలో విచారణ సమయానికి వొడాఫోన్ ఐడియా, ఎయిర్​టెల్​లు తమ ఆర్థిక స్థితిపై స్టేట్​మెంట్​ను సమర్పించాలని సుప్రీం కోర్టు గత నెలలో సూచించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వానికి డబ్బు అవసరమని.. ఇందుకోసం ఆయా టెలికాం సంస్థలు కొంత ఏజీఆర్​ బకాయి కూడా చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్ ఐడియా రూ.వెయ్యి కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:యాప్​ ఇన్నోవేషన్ ఛాలెంజ్​కు గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.