ETV Bharat / business

వొడాఫోన్​-ఐడియా క్యూ3 నష్టం రూ.6,438.8 కోట్లు - వొడాఫోన్​ఐడియాల ఆదాయం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్​-డిసెంబర్​ త్రైమాసికానికి వొడాఫోన్​-ఐడియా రూ.6,438.8 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 5 శాతం మేర తగ్గినట్లు వెల్లడించింది.

vodafoneidea losses
వొడాఫోన్ఐడియా నష్టాలు
author img

By

Published : Feb 13, 2020, 7:50 PM IST

Updated : Mar 1, 2020, 6:05 AM IST

దేశీయ టెలికాం దిగ్గజం వొడాఫోన్-ఐడియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలోనూ తేరుకోలేకపోయింది. 2019-20 డిసెంబర్​ త్రైమాసికంలో ఈ సంస్థ రూ.6,438.8 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ నష్టం రూ.5,004.6 కోట్లుగా ఉంది.

ఏజీఆర్​ బకాయిలు చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో.. సంస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ కారణంగా త్రైమాసిక ఫలితాల్లో వరుసగా భారీ నష్టాలను ప్రకటిస్తూ వస్తోంది.

ఆదాయం 5 శాతం క్షీణత..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వొడాఫోన్-ఐడియా పూర్తి ఆదాయం 5 శాతం తగ్గి రూ.11,380.5 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.11,982.8 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి:భారత పర్యటన: ఓ వైపు ట్రంప్​.. మరోవైపు సత్యనాదెళ్ల!

Last Updated : Mar 1, 2020, 6:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.