భారత మార్కెట్లో మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో. యూ సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా.. యూ20 పేరుతో ఈ మోడల్‌ను తీసుకువచ్చింది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 6 జీబీ ర్యామ్, 64 జీబీ రామ్ వేరియంట్లలో ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది వివో. వీటి ధరలు వరుసగా రూ.10,990, రూ.11,990 గా నిర్ణయించింది. ఈ మోడల్ ఫోన్లను గ్రేటర్ నోయిడాలోని సంస్థ తయారీ కేంద్రంలోనే ఉత్పత్తి చేస్తున్నట్లు వివో వెల్లడించింది.
వివో యూ20 మోడల్ ఫోన్లు అమెజాన్, వివో ఇండియా ఈ-స్టోర్లలో ఈ నెల 28 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
యూ20 ఫీచర్లు..
- 6.53 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే
- ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా (16 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్
- ఆండ్రాయిడ్ 9 ఓఎస్
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇదీ చూడండి:రెడ్ మీ కే30లో అదిరే ఫీచర్లు.. భారత్‌కు 5జీ మోడల్?