ETV Bharat / business

జూన్​లో 'వీ'ను వీడిన 48.2 లక్షల చందాదారులు - జూన్​లో ఎయిర్​టెల్ యూజర్ల సంఖ్య

ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(వీ).. జూన్​లో 48.2 లక్షల మొబైల్ చందాదారులను కోల్పోయింది. ఇదే సమయంలో జియోకు మాత్రం దాదాపు 45 లక్షల వినియోగదారులు పెరిగారు. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' వెల్లడించిన నెలవారీ గణాంకాల్లో ఈ విషయం తెలిసింది.

Vi lost huge Use base in June
వొడాఫోన్​ ఐడియాకు భారీగా తగ్గిన యూజర్లు
author img

By

Published : Sep 24, 2020, 7:15 PM IST

టెలికాం దిగ్గజాలు వొడాఫోన్​ ఐడియా (వీ), ఎయిర్​టెల్ జూన్​లోనూ భారీగా వినియోగదారులను కోల్పోయాయి. వీ అత్యధికంగా 48.2 లక్షల వినియోగదారులను.. ఎయిర్​టెల్ 11.3 లక్షల మంది చందాదారులను కోల్పోయినట్లు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' నెలవారీ నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో రిలయన్స్ జియోకు మాత్రం 45 లక్షల వినియోగదారులు పెరిగినట్లు తెలిపింది.

దేశంలో మొత్తం మొబైల్ నెట్​వర్క్ చందాదారులు జూన్​లో 0.28 శాతం తగ్గి 114 కోట్లుగా ఉన్నట్లు ట్రాయ్​ పేర్కొంది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జూన్​ చివరి నాటికి వైర్​లెస్​ మొబైల్ చందాదారుల సంఖ్య వరుసగా.. 54.3 శాతం, 45.7 శాతంగా ఉన్నట్లు ట్రాయ్ వివరించింది.

నెట్​వర్క్​ల వారీగా యూజర్లు..

జూన్ చివరి నాటికి దేశీయ ప్రధాన టెల్కోలైన జియోకు మొత్తం 39.7 కోట్లు (+44.9 లక్షలు ), ఎయిర్​టెల్​కు 31.6 కోట్లు (-11.3 లక్షలు), వొడాఫోన్ ఐడియాకు 30.5 కోట్ల (-48.2 లక్షలు).. చొప్పున చందాదారులు ఉన్నట్లు ట్రాయ్ నివేదికలో తేలింది.

దేశంలో బ్రాడ్ బ్యాండ్ చందాదారుల సంఖ్య మే తో పోలిస్తే.. జూన్​ నాటికి 2 శాతం పెరిగి.. 69.8 కోట్లకు చేరినట్లు ట్రాయ్ పేర్కొంది. మొత్తం బ్రాడ్​ బ్యాండ్ యూజర్లలో 98.93 శాతం వాటా టాప్ 5 కంపెనీలదేనని తెలిపింది.

కంపెనీల వారీగా యూజర్లు..

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్​కు 39.83 కోట్లు, ఎయిర్​టెల్​కు 15.1 కోట్లు, వొడాఫోన్ ఐడియాకు 11.64 కోట్లు, బీఎస్​ఎన్​ఎల్​కు 2.3 కోట్ల చొప్పున బ్రాడ్​ బ్యాండ్ యూజర్లు ఉన్నట్లు ట్రాయ్​ వివరించింది.

ఇదీ చూడండి:ఆ విమానాల్లో జియో మొబైల్ సేవలు- ప్లాన్లు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.