ETV Bharat / business

కొవిడ్ రిలీఫ్ ఆఫర్లు- రీఛార్జ్, టాక్​టైం ఫ్రీ! - కరోనా కాలంలో ఉచిత రీఛార్జ్​

కరోనా నేపథ్యంలో టెలికాం సంస్థలు తమ యూజర్లకు కొవిడ్ రిలీఫ్​ ఆఫర్లను ఇస్తున్నాయి. జియో ఫ్రీ టాక్​టైమ్ ఆఫర్​ ప్రకటించగా.. ఎయిర్​టెల్, వొడాఫోన్ ఐడియా ఫ్రీ రీఛార్జ్ ప్యాక్​ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఆఫర్లపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Covid relief offers to Mobile users
ఫ్రీ మొబైల్ రీఛార్జ్​ ఆఫర్లు
author img

By

Published : May 18, 2021, 8:10 PM IST

దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టెలికాం సంస్థలు తమ వినియోగదారులకు కొవిడ్ రిలీఫ్ ఆఫర్లు ఇస్తున్నాయి. తక్కువ ఆదాయం కలిగిన 6కోట్ల వినియోగదారులకు రూ.49 విలువైన రీఛార్జ్​ను ఉచితంగా ఇస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా (వి) మంగళవారం ప్రకటించింది. ఇందుకోసం రూ.294 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది.

రూ.49 ఉచిత రీఛార్జ్ ద్వారా 28 రోజుల వ్యాలిడిటీతో రూ.38 టాక్​టైం, 100 డేటా లభించనుంది. ఫ్రీ రీఛార్జ్​తో పాటు ఆర్​సీ 79 ద్వారా రూ.128 టాక్​టైం​, 200 ఏంబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో ఇస్తున్నట్లు తెలిపింది.

ఇతర టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్​టెల్​ కూడా ఇది వరకే తమ యూజర్లకు కొవిడ్ రిలీఫ్ ఆఫర్లు ప్రకటించాయి.

జియో ఫ్రీ టాక్​టైం..

రీఛార్జ్​ చేసుకోలేని జియో ఫోన్​ వినియోగదారులకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్​గోయింగ్​ కాల్స్​ను అందించనున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది.

ఎయిర్​టెల్ ఫ్రీ రీఛార్జ్​..

రెండో అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్​టెల్​ కూడా తక్కువ ఆదాయ వర్గంలోని 5.5 కోట్ల మందికి రూ.49 విలువైన ఫ్రీ రీఛార్జ్​ ప్యాక్​ను సోమవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది.

ఇదీ చదవండి:ఆ యాప్​ ఉంటే 300 మందితో రోజంతా ఫ్రీ వీడియో కాల్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.