ETV Bharat / business

హువావేపై బ్రిటన్ నిషేధం.. అమెరికా హర్షం - చైనాకు మరో షాక్

ప్రపంచవ్యాప్తంగా చైనా సంస్థలపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ హువావే 5జీ పరికరాలపై నిషేధం విధిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది.

uk bans huawei
హువావేపై బ్రిటన్ నిషేధం
author img

By

Published : Jul 15, 2020, 11:42 AM IST

చైనా టెలికాం దిగ్గజం హువావేకు బ్రిటన్ షాకిచ్చింది. బ్రిటన్ 5జీ నెట్​వర్క్ ​నుంచి హువావేను నిషేధించింది. యూకేలోని 5జీ నెట్‌వర్క్‌ల నుంచి 2027 కల్లా హువావే పరికరాలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది.

హువావేపై అమెరికా తాజా ఆంక్షలను పరిగణనలోకి తీసుకోవడం సహా సైబర్‌ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని, నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్(ఎన్‌సీఎస్‌సీ) సమీక్ష అనంతరం యూకే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.

2020 డిసెంబరు 31 తరువాత 5జీ పరికరాలేవీ హువావే వద్ద కొనకుండా పూర్తిస్థాయి నిషేధం విధించింది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆధ్వర్యంలో జరిగిన యూకే నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఈ మేరకు తీర్మానాలు ఆమోదించింది.

'5జీ మన దేశ తీరునే మార్చనుంది. అయితే ఆ నెట్‌వర్క్‌ మనదేశ భద్రత, మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నప్పుడే' అని యూకే డిజిటల్‌ మంత్రి ఓలివర్‌ డౌడెన్‌ పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి హువావే పరికరాలు వేటినీ యూకే 5జీ నెట్‌వర్క్​లో కొత్తగా అమర్చరని స్పష్టం చేశారు. యూకే 5జీ నెట్‌వర్క్‌లో 2027కు హువావే పరికరాలే ఉండవని వివరించారు.

స్వాగతించిన అమెరికా..

బ్రిటన్​ హువావేను నిషేధిస్తున్నట్లు వచ్చిన వార్తలను అమెరికా స్వాగతిచింది. 5జీ నెట్​వర్క్​ నుంచి హువావే తొలగింపు నిర్ణయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.

హువావే సాంకేతికతను వినియోగించొద్దని చాలా దేశాలను కోరినట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. కరోనా సహా చాలా విషయాల్లో చైనాపై అమెరికా కొంత కాలంగా ఆగ్రహంతో ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:భారత్​లోకి వాల్​మార్ట్.. వయా ఫ్లిప్​కార్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.