ETV Bharat / business

సొంత 5జీ టెక్నాలజీతో 'క్లీన్​ టెల్కో'గా రిలయన్స్ జియో! - జియో 5జీ వార్తలు

చైనాకు చెందిన హువావేతో సంబంధం లేకుండా 5జీ టెక్నాలజీ కోసం కృషి చేస్తున్న రిలయన్స్ జియోను 'క్లీన్ టెల్కో'గా అభివర్ణించింది అమెరికా. ఈ జాబితాలో జియోతోపాటు ఫ్రాన్స్​, జపాన్, బ్రిటన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలకు చెందిన టెలికాం సంస్థలు కూడా ఉన్నాయి.​

jio listed as clean telco
జియో క్లిన్​ టెల్కో
author img

By

Published : Jul 21, 2020, 12:29 PM IST

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోను 'క్లీన్​ టెల్కో'ల జాబితాలో చేర్చింది అమెరికా. చైనాకు చెందిన హువావే వంటి టెలికాం సంస్థలతో వ్యాపారం చేసేందుకు జియో నిరాకరించడమే ఇందుకు ప్రధాన కారణం.

తమ కమ్యూనికేషన్, క్లౌడ్​, మొబైల్ యాప్స్​, ఇంటర్​నెట్​ ఆఫ్ థింగ్స్ డేటా విశ్వసనీయత లేని సంస్థల చేతిలో పడకుండా చూసుకోవడం, అలాంటి కంపెనీలతో సంబంధాలు పెట్టుకోని సంస్థలనే 'క్లీన్​ టెల్కో'లుగా నిర్వచించింది అమెరికా.

క్లీన్​ టెల్కోల జాబితాలో భారత్​కు చెందిన రిలయన్స్ జియోతో పాటు ఆరెంజ్ (ఫ్రాన్స్​), టెలెస్ట్రా (ఆస్ట్రేలియా), ఎస్​కే, ఎస్​టీ (దక్షిణ కొరియా), ఎన్​టీటీ (జపాన్​), ఓ2 (బ్రిటన్​) వంటి సంస్థలు ఉన్నాయి. ఈ టెల్కోలన్నీ హువావే వంటి సంస్థతో వ్యాపారం చేసేందుకు నిరాకరించాయి.

రిలయన్స్ 5జీ..

జియో 5జీ ట్రయల్స్ త్వరలోనే చేపడుతామని రిలయన్స్ 43వ ఏజీఎంలో సంస్థ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. చైనా కంపెనీల సహకారం లేకుండా సొంతంగానే 5జీ టెక్నాలజీని రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది ఎప్పుడైనా 5జీ అందుబాటులోకి రావచ్చని పేర్కొన్నారు.

హూవావేపై బ్రిటన్ నిషేధం..

బ్రిటన్​లో 5జీ టెక్నాలజీ నుంచి హువావేను నిషేధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వాడిన టెక్నాలజీని తొలగించాలని కూడా స్పష్టం చేసింది.

uk bans huawei
హువావేపై బ్రిటన్ నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.