దేశీయ క్యాబ్ సేవల సంస్థ 'ఓలా' అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ- స్కూటర్)లకు భారీగా క్రేజ్ పెరిగింది. కొత్తగా తెలుపు రంగు ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. 'దీనిపై మీ అభిప్రాయమేంటి?' అని అడుగుతూ వైట్ ఓలా ఈ-స్కూటీ ఫొటోను షేర్ చేశారు.
అయితే.. ఇప్పటివరకు ఓలా ఈ-స్కూటర్ రేంజ్, బ్యాటరీ సైజ్, టాప్ స్పీడ్ మొదలైన అంశాలపై సంస్థ స్పష్టత ఇవ్వలేదు. కానీ, దేశీయ మార్కెట్లో ఈ స్కూటర్ విడుదలపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే ఈ స్కూటర్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.
-
Tried one in white. What do you all think! #JoinTheRevolution https://t.co/lzUzbWbFl7 @OlaElectric pic.twitter.com/iw7fPsEhvh
— Bhavish Aggarwal (@bhash) July 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tried one in white. What do you all think! #JoinTheRevolution https://t.co/lzUzbWbFl7 @OlaElectric pic.twitter.com/iw7fPsEhvh
— Bhavish Aggarwal (@bhash) July 19, 2021Tried one in white. What do you all think! #JoinTheRevolution https://t.co/lzUzbWbFl7 @OlaElectric pic.twitter.com/iw7fPsEhvh
— Bhavish Aggarwal (@bhash) July 19, 2021
ఓలా ఈ-స్కూటర్ విషయాలు..
- జులై 15న ఓలా సంస్థ.. ఈ-స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన 24 గంటల్లోనే ఈ-స్కూటర్లకు లక్ష బుకింగ్‌లు రావడం గమనార్హం.
- అడ్వాన్స్ బుకింగ్ కోసం వినియోగదారుల నుంచి రూ. 499 వసూలు చేసింది ఓలా.
- ఈ-స్కూటర్ల కోసం దేశవ్యాప్తంగా 400 నగరాల్లో లక్ష ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది ఓలా. ఛార్జింగ్ స్టేషన్లను దూర ప్రాంతాల్లో కాకుండా, షాపింగ్ మాల్స్, ఐటీ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్స్‌లు, కెఫ్ల వంటి ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయనుంది.
- ఓలా స్కూటర్లో ఇన్‌స్టాలేషన్ అవసరం లేని హోమ్ ఛార్జర్ కూడా ఉంటుంది. ఈ ఛార్జర్‌తో 18 నిమిషాల్లో 50 శాతానికి పైగా ఛార్జ్ చేయవచ్చు. తద్వారా 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
- 'మేడ్ ఇన్ ఇండియా' నుంచి విదేశాలకు ఈ స్కూటర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓలా. ఇందుకు సంబంధించి ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులో ఏర్పాటు చేసింది.
- భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ తమ ఈ-స్కూటర్లను విక్రయించేందుకు సన్నాహాలు జరుపుతోంది.
ఇదీ చదవండి: