మూడు చైనా బ్యాంకులకు ఇవ్వాల్సిన 717 మిలియన్ అమెరికన్ డాలర్ల బాకీని 21 రోజుల్లో తిరిగి చెల్లించాలని ప్రముఖ వ్యాపార వేత్త అనీల్ అంబానీకి.. మరోసారి ఆదేశాలు జారీ చేసింది బ్రిటన్ హైకోర్టు.
గతంలోనూ..
ఆరువారాల్లోగా 100 మిలియన్ అమెరికన్ డాలర్లు డిపాజిట్ చేయాల్సిందేనని గతంలోనూ షరతులతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది.
ఉల్లంఘణ కారణంగా!
ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంకు ఆఫ్ చైనా లిమిటెడ్ (ఐసీబీసీఎల్) ముంబయి శాఖ, చైనా డెవలప్మెంట్ బ్యాంకు, ఎక్జిమ్ బ్యాంకు వద్ద వ్యక్తిగత పూచీకత్తు నిబంధనలను ఉల్లంఘించి.. 2012 ఫిబ్రవరిలో 925 మిలియన్ డాలర్లు రుణాన్ని అనీల్ అంబానీ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదీ చూడండి: 'ఆర్బీఐ చర్యలతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ'