పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ ట్విట్టర్ పేజీని తిరిగి అన్‌బ్లాక్ చేసింది ట్విట్టర్. సరిహద్దు వద్ద చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ.. మోదీ ప్రకటించిన 'ఆత్మ నిర్భర్ భారత్' సహా చైనా వ్యతిరేక సెంటిమెంట్‌ను ప్రోత్సహించే విధంగా ట్వీట్ చేసిందనే కారణంతో జూన్ 4న అమూల్ పేజిని బ్లాక్ చేసింది ట్విట్టర్.
అమూల్ పోస్ట్‌లో ఏముంది?
జూన్ 3న తన అధికారిక పేజీలో అమూల్ ఓ ట్వీట్ చేసింది. అందులో అముల్ లోగోలో ఉండే చిన్నారి.. డ్రాగన్‌తో ఫైట్ చేస్తున్నట్లు ఉంది. దానితో పాటు వీడియోలో వెనుక ఎగ్జిట్ ది డ్రాగన్? అనే నినాదాన్ని రాసుకొచ్చింది అమూల్. అందులో ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్, ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా లోగోలను ఉంచి అవి చైనా సంస్థలే అని తెలిపే విధంగా ప్రస్తావించింది. అందులోనే 'అమూల్ మేడ్ ఇన్ ఇండియా' అనే పేరును హైలెట్ చేసింది.
అమూల్‌కు ఇది కొత్తేం కాదు..
అమూల్ ఇలా చేయడం కొత్తేం కాదు. రాజకీయ, సామాజిక అంశాలపై అమూల్ నిత్యం తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంటుంది.